BigTV English

Bhatti: నేనే సీఎం.. నాకేం తక్కువ?.. రేవంత్‌పై భట్టి మైండ్‌గేమ్!?

Bhatti: నేనే సీఎం.. నాకేం తక్కువ?.. రేవంత్‌పై భట్టి మైండ్‌గేమ్!?
revanth bhatti

Bhatti: సీఎం.. సీఎం.. రేవంత్ సీఎం.. అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరుచూ చేసే నినాదం ఇది. ఆయన పీసీసీ చీఫ్ అయిన వెంటనే గాంధీభవన్‌ నుంచి మాట్లాడుతున్న సమయంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున సీఎం.. సీఎం అంటూ గట్టిగా నినాదాలు చేశారు. అలా స్లోగన్స్ చేస్తున్న కేడర్‌కు రేవంత్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి తనను సీఎం.. సీఎం.. అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పూర్తిగా అధిష్టానం నిర్ణయమేనని.. పార్టీ ఎవరిని నియమిస్తే వారే సీఎం అవుతారని.. ఇంకోసారి ఇలాంటి నినాదాలు ఇవ్వద్దని పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే తేల్చి చెప్పారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో సీఎం టాపిక్‌ను గట్టిగా రిజెక్ట్ చేశారు. అదీ పార్టీపై ఆయనకున్న కమిట్‌మెంట్. ఇదంతా ఎందుకంటే…


ఇటీవల కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిపై జోరుగా చర్చ, రచ్చ నడుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం అవుతారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఆయన వ్యాఖ్యలను పార్టీ ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఖండించారు. అటు, అదేరోజు జరిగిన మంచిర్యాల కాంగ్రెస్ సత్యాగ్రహ సభలోనూ మళ్లీ సీఎం సీఎం నినాదాలు వినిపించాయి. ఈసారి పేరు మారింది. ‘భట్టి సీఎం’ అంటూ సభకు వచ్చిన కార్యకర్తలు కొందరు స్లోగన్స్ ఇచ్చారు. వరుస పరిణామాలు చూస్తుంటే.. వ్యూహాత్మకంగా దళిత ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క పేరును ప్రచారంలో ఉంచుతున్నారని అంటున్నారు.

కట్ చేస్తే, లేటెస్ట్‌గా భట్టి సైతం తన సీఎం పదవిపై మనసులో మాట బయటపెట్టారు. అవును, ప్రజలు ఆశీర్వదిస్తే తాను ముఖ్యమంత్రి అవుతా.. అందులో తప్పేముంది? అన్నారు. సీఎం కావడానికి తనకేం తక్కువ? అన్నారు. ఇప్పుడే కాదు గతంలోనూ తాను సీఎం రేసులో ఉండేవాడినని చెప్పారు. అధిష్టానం అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి పదవిని సంతోషంగా స్వీకరిస్తానని.. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని.. సీఎం పదవిని హోదాలా కాకుండా బాధ్యతగా భావిస్తానని చెప్పుకొచ్చారు భట్టి.


ఆలూ లేదు, చూలు లేదు.. అన్నట్టు ఉంది భట్టి మాటలు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముందు కాంగ్రెస్ గెలుపుపై ఫోకస్ పెట్టాలి కానీ.. ఇప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఈ గొప్పలేంటి? అంటున్నారు కార్యకర్తలు. సీఎం నినాదాలను రేవంత్‌రెడ్డి అంతగా కంట్రోల్ చేస్తుంటే.. భట్టి మాత్రం తానే ముఖ్యమంత్రి అవుతాననేలా ఇప్పటి నుంచే ప్రచారం చేసుకోవడం వ్యూహాత్మకమా? రేవంత్‌పై మైండ్ గేమా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×