BigTV English

AvinashReddy: అవినాష్‌రెడ్డిని సీబీఐ అడిగిన ప్రశ్నలు ఇవే!? మరి, ఆయన ఏం చెప్పారంటే..

AvinashReddy: అవినాష్‌రెడ్డిని సీబీఐ అడిగిన ప్రశ్నలు ఇవే!? మరి, ఆయన ఏం చెప్పారంటే..
avinash-reddy-cbi

AvinashReddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని 8 గంటల పాలు ప్రశ్నించింది. అవినాశ్ రెడ్డి విచారణను అధికారులు వీడియోలో రికార్డు చేశారు. అంతేకాకుండా ఆయన నుంచి లిఖితపూర్వకంగా సమాధానాలను తీసుకున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో 40 కోట్లు డీల్ ఉందని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఈ డీల్ గురించే అవినాశ్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారని సమాచారం. మరో వైపు సునీల్ యాదవ్‌కు కోటి రూపాయాలు ఎవరు బదిలీ చేశారనే విషయమై కూడా సీబీఐ ప్రశ్నించింది. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టైన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. దీంతో ఈ ఇద్దరిని కూడా సీబీఐ అధికారులు విచారించారు.


విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా అవినాశ్‌ను ప్రశ్నించారు. వివేకా హత్యకు మూడు గంటల ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో అరెస్టయిన వారందరూ అవినాశ్‌తో ఎందుకు సమావేశమయ్యారో ఆరా తీశారు.

అంతకుముందు వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను వేర్వేరుగా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ ముగ్గురిని కలిపి సుమారు గంటన్నరపాటు ప్రశ్నించారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం సీబీఐ కార్యాలయం నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో వైపు నిందితులకు వైఎస్ అవినాశ్‌ రెడ్డిలకు ఉన్న సంబంధాలపై సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. గూగుల్ టేకవుట్ డేటా ఆధారంగా సీబీఐ అధికారులు ముగ్గురిని ప్రశ్నించారని తెలుస్తోంది. నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి ఎందుకు వచ్చారనే విషయమై సీబీఐ అధికారులు ఆరా తీశారు.


ఇటు వైఎస్‌ వివేకా హత్యకేసుపై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ దియోధర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు తప్పు చేసిన జైలు శిక్ష తప్పదని వివేకా హత్య కేసులో కూడా అదే జరుగుతుందని.. జగన్‌ తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లక తప్పదన్నారు. వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారని, వారిపై వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటిపని అవి చేసుకుంటూ వెళ్తాయని, అధారాలున్నాయి కాబట్టే నిందితులను అరెస్ట్‌ చేస్తున్నారని స్పష్టం చేశారు.

మొత్తానికి కోర్టు ఈనెల 25 వరకు అవినాశ్‌రెడ్డిని అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించిన తర్వాత.. తొలిరోజు విచారణ ముగిసింది. ఐతే.. 25వ తేదీ వరకు రోజూ విచారణకు హాజరుకానున్నారు అవినాశ్‌రెడ్డి. దీంట్లో భాగంగానే మళ్లీ గురువారం ఉదయం పదిన్నర గంటలకు విచారణకు రావాలని అవినాశ్‌ రెడ్డిని ఆదేశించారు సీబీఐ అధికారులు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×