BigTV English

Summer Power Supply : విద్యుత్ సున్నితమైన అంశం – జాగ్రత్తగా ఉండండి – అధికారులకు భట్టి ఆదేశాలు

Summer Power Supply : విద్యుత్ సున్నితమైన అంశం – జాగ్రత్తగా ఉండండి – అధికారులకు భట్టి ఆదేశాలు

Summer Power Supply :  


⦿ వేసవిలో రెప్పపాటు కూడా అంతరాయం ఏర్పడవద్దు
⦿ అవసరమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
⦿ 1912 నెంబర్ వినియోగదారులందరికీ చేరాలి, ఉత్తమ సేవలు అందించే సిబ్బందికి పురస్కారాలు
⦿ విద్యుత్ అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

రానున్న వేసవిలో డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యుత్ శాఖలో ఎలాంటి సమన్వయ లోపాలు లేకుండా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సహా అనేక అంశాలపై విద్యుత్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు వేసవిలో క్షణకాలం పాటు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం వచ్చేందుకు వీలు లేదన్న భట్టి విక్రమార్క.. అధికారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేందుకు, నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. గత వేసవిలోని విద్యుత్ డిమాండ్ ను పరిశీలించి.. రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్తు డిమాండ్ ఉంటుందో అంచనాలు రూపొందించాలన్న భట్టి విక్రమార్క.. వివిధ సమస్యలపై అధికారులు అందజేసిన నివేదికలను పరిశీలించారు.


విద్యుత్ సరఫరా అనేది సున్నితమైన అంశమని గుర్తు చేసిన డిప్యూటీ సీఏం.. విద్యుత్ అనేక ఇప్పుడు నిత్యవసరంగా మారిందని అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వేసవి ప్రణాళికపై అన్ని స్థాయిల్లో అధికారులు వెనువెంటనే సమావేశం నిర్వహించుకోవాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు అన్నీ రీతులుగా సిద్ధంగా ఉండాలని అన్నారు. విద్యుత్ వినియోగం, పొదుపుపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

మనదంతా ఓ కుటుంబం – నాకు ఫోన్ చేయండి
విద్యుత్ శాఖలో క్షేత్రస్థాయిలో పని చేసే లైన్ మెన్ దగ్గర నుంచి విద్యుత్ శాఖ మంత్రి వరకు ఒకే కుటంబమన్న భట్టి విక్రమార్క.. అంతా కలిసికట్టుగా పని చేసి విద్యుత్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో ఏ సమస్య వచ్చినా వెంటనే పై అధికారులను సంప్రదించాలని.. వారి సూచనలతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. విద్యుత్ శాఖలో క్షేత్ర స్థాయిలో కావలసిన వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన భట్టి విక్రమార్క.. ఇంకా ఏమైనా కావాలంటే తనకు తెలపాలన్నారు.

హైదరాబాద్ నగరంలో ఎమర్జెన్సీ వాహనాల ద్వారా కొనసాగుతున్న విద్యుత్ సేవలు.. గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కోరిన అన్ని అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమన్న భట్టి విక్రమార్క.. మార్చి మొదటి తేదీ నాటికి సబ్ స్టేషన్ల నిర్మాణం సహా ఇతర పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలోనే గత మూడేళ్లుగా విద్యుత్ సబ్ స్టేషన్లపై పెరుగుతున్న లోడ్ భారం వివరాల్ని పరిశీలించారు.

ఉత్తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు
విద్యుత్ శాఖలో ఉత్తమ పని తీరు కనబరిచే ఉద్యోగులకు మంచి ప్రోత్సాహకాలు, అవార్డులు అందించాలని.. అందుకు కార్యచరణ ప్రారంభించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఇటీవల రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాల సమయంలో అర్థరాత్రులు సైతం విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు విద్యుత్ సిబ్బంది తీవ్రంగా కృషి చేసారని ప్రశంసించిన భట్టి విక్రమార్క.. అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. రోజురోజుకు పెరిగితున్న విద్యుత్ డిమాండ్, ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తి, ఈ రంగంలో ప్రపంచంలో వస్తున్న మార్పులపై సిబ్బందికి అవగాహన అవసరమని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు.

డయల్ 1912 – ప్రచారం చేయాలి
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన డయల్ 1912 కు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఈ సమావేశంలో భట్టి విక్రమార్క అధికారుల్ని ఆదేశించారు. ఇలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రతి వినియోగదారునికి తెలిసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ వినియోగదారుడి మొబైల్ నెంబర్ కు 1912 నుంచి ఎస్ఎంఎస్ పంపించాలని, కరెంట్ బిల్లుల పైగా… 1912 సేవల గురించి ప్రచారం కల్పించాలని ఆదేశించారు. విద్యుత్ రంగాన్ని పటిష్టం చేసేందుకు సిబ్బంది సంఖ్య పెంచడం, సాంకేతికంగా అదనపు హంగుల్ని జోడించడం నిరంతరం కొనసాగాలని.. అందుకు అవసరమైన నిధుల కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

Related News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Big Stories

×