Apprentice Jobs: టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. ఆర్ఆర్‌సీ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్నఅభ్యర్థులందరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆర్ఆర్‌సీ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1154 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 25 న నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 14తో దరఖాస్తు గడువు ముగియనుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
ఆర్ఆర్‌సీ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జనవరి 25
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 14
వయస్సు: పోస్టుకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మద్య వయస్సు ఉండాలి.
విద్యార్హత: అభ్యర్థులు టెట్త్, ఇంటర్, ఐటీఐ పాసై ఉండాలి.
ఇందులో డివిజన్ల వారీగా వెకెన్సీలు ఉన్నాయి. దానాపూర్, దానాబాద్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్, సోనాపూర్ డివిజన్, సమస్తిపూర్ డివిజన్, ప్లాంట్ డిపోట్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, క్యారేజ్ రిపైర్ వర్క్ షాప్, హర్నౌత్, మెకానికల్ వర్క్ షాప్ సమస్తిపూర్ డివిజన్లలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
డివిజన్ల వారీగా..
దానాపూర్ డివిజన్ – 675
దానాబాద్ డివిజన్ – 156
దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ – 64
సొనాపూర్ డివిజన్ – 47
సమస్తిపూర్ డివిజన్ – 46
ప్లాంట్ డిపోట్/దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ -29
క్యారేజ్ రిపైర్ వర్క్ షాప్/ హర్నౌత్- 110
మెకానికల్ వర్క్ షాప్/సమస్తిపూర్- 27
పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://ecr.indianrailways.gov.in/
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఇంత భారీ మొత్తం అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చినప్పుడే దరఖాస్తు చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.