Jr. NTR:జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) సినిమాల లైనప్ మామూలుగా లేదు. ఓవైపు బాలీవుడ్ లో వార్-2 సినిమా చేస్తూనే.. ఇంకోవైపు మరిన్ని సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) , ఎన్టీఆర్( NTR) కాంబోలో సినిమా సెట్ అయినట్టే.. అలాగే ‘దేవర 2’ కూడా ఉంది. అయితే తాజాగా దేవర 2 కి బ్రేక్ పడినట్టు సిని వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దేవర-2 కు బ్రేక్ పడి ఎన్టీఆర్ మరో కొత్త డైరెక్టర్ ని లైన్ లో పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఇంతకీ దేవర -2కు బ్రేక్ ఎందుకు పడింది..? ఎన్టీఆర్ కొత్త మూవీ ఏ డైరెక్టర్ తో ఉండబోతోంది? అనేది ఇప్పుడు చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో హిందీలో వార్ 2 (War-2) మూవీలో చేస్తున్నారు. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నారు. ఇక ఈ సినిమా పూర్తవ్వడంతోనే ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ అవుతారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ కాంబోలో రాబోయే సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.
కొత్త డైరెక్టర్ ను లైన్ లో పెడుతున్న ఎన్టీఆర్..
ఎన్టీఆర్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమా షూట్ మే లో స్టార్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి కచ్చితంగా రెండు సంవత్సరాల వరకు టైం పడుతుంది. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ కొరటాల శివ ప్రిపేర్ చేస్తున్న దేవర 2 (Devara-2) మూవీలోనే ఎన్టీఆర్ పాల్గొంటారని ఇప్పటివరకు వార్తలు వినిపించినప్పటికీ, ఇప్పుడు సరికొత్త డైరెక్టర్ పేరు తెర మీద వినిపిస్తోంది. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar).. రజినీకాంత్ (Rajinikanth) కి జైలర్ (Jailer) వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేసే యోచనలో ఉన్నట్టు కోలీవుడ్ సినీ వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar) కి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య కొన్ని కథా చర్చలు జరిగాయని, నెల్సన్ దిలీప్ కుమార్.. ఎన్టీఆర్ కి స్టోరీ లైన్ కూడా చెప్పాడని, ఆ లైన్ బాగా నచ్చడంతో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి కచ్చితంగా సినిమా చేద్దాం అని ఎన్టీఆర్ మాట ఇచ్చినట్టు ఫిలింనగర్లో వార్త చక్కర్లు కొడుతోంది.
దేవర 2 కి బ్రేక్ పడినట్టేనా..?
ఒకవేళ ఇదే నిజమైతే దేవర-2 కు బ్రేక్ పడ్డట్టే.. ఎందుకంటే దేవర పార్ట్ 1 కి చాలా నెగటివిటీ వచ్చింది.దేవర 2 కూడా తీయడం వేస్ట్.. బడ్జెట్ బొక్క అని ఎంతోమంది కామెంట్లు పెట్టారు. మరి చూడాలి జూనియర్ ఎన్టీఆర్ దేవర-2 ని పక్కన పెడతారా..? నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేస్తారా? అనేది ముందు ముందు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్, రజినీకాంత్ కూలీ సినిమా షూట్ ముగియడంతోనే జైలర్ -2(Jailar-2 )సినిమా తీయబోతున్నారు.