E-Paper
Advertisement

కేబీఆర్ తరహాలో లక్డీకాపూల్‌లోనూ వన్-వే రూట్.. సీపీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఎటు నుంచి వెళ్లాలంటే?

కేబీఆర్ తరహాలో లక్డీకాపూల్‌లోనూ వన్-వే రూట్.. సీపీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఎటు నుంచి వెళ్లాలంటే?
Advertisement

Lakdikapul One Way Plan: నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్‌ పరిసరాల్లో వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంట్లో భాగంగా కొత్తగా వన్‌-వే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, వన్‌-వే సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు హైదరాబాద్‌ సీపీ వీ.సీ.సజ్జనార్‌ శుక్రవారం బైక్‌ పై పర్యటించారు. ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవిస్‌, డీసీపీ అవినాశ్‌ కుమార్‌ లతో కలిసి ద్వారకా హోటల్‌, పాత సైఫాబాద్‌ పీఎస్‌, హెచ్డీఎఫ్సీ , ఇక్బాల్‌ మినార్‌, రవీంద్రభారతి, లక్డీకాపూల్‌ చౌరస్తా, ఓల్డ్ కంట్రోల్ రూమ్ జంక్షన్‌ పరిధిలోని రహదారుల స్థితిగతులు, వాహనాల రద్దీని పరిశీలించారు. ఆపై ట్రాఫిక్ అధికారులకు కీలక సూచనలు చేశారు.

ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం ఓల్డ్ కంట్రోల్ రూం నుంచి రవీంద్రభారతి మీదుగా ఇక్బాల్‌ మినార్‌ వైపు వెళ్లి సికింద్రాబాద్‌ చేరుకోవాలనుకునే వాహనాలను రవీంద్రభారతి నుంచి నేరుగా అనుమతించకుండా HDFC, పాత సైఫాబాద్‌ పీఎస్‌, ఇక్బాల్‌ మినార్‌, సచివాలయం జంక్షన్‌ మీదుగా దారి మళ్లిస్తారు. ఇక నిరంకారీ జంక్షన్‌ నుంచి ఓల్డ్ కంట్రోల్ రూం వైపు వెళ్లాలనుకునే వాహనాలు నేరుగా HDFC జంక్షన్‌ వైపు వెళ్లకుండా పాత సైఫాబాద్‌ పీఎస్‌ వద్ద మళ్లించి ఇక్బాల్‌ మినార్‌ మీదుగా కుడి మలుపు తీసుకుని రవీంద్రభారతి ద్వారా ఓల్డ్ కంట్రోల్ రూంకు పంపనున్నారు.

Advertisement

మరోవైపు సచివాలయం జంక్షన్‌, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌ నుంచి పాత సైఫాబాద్‌ పీఎస్‌ వైపు వెళ్లే వాహనాలు నేరుగా కాకుండా ఇక్బాల్‌ మినార్‌ నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లి, ఓల్డ్ కంట్రోల్ రూమ్ వద్ద యూ-టర్న్‌ తీసుకుని అసెంబ్లీ గేట్‌ నెం.3, రవీంద్రభారతి, హెచ్డీఎఫ్సీ మీదుగా పాత సైఫాబాద్‌ పీఎస్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఈ వన్‌-వే విధానం సజావుగా సాగేందుకు త్వరలోనే జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్‌ శాఖలతో పాటు ఇతర భాగస్వామ్య విభాగాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సీపీ సజ్జనార్‌ తెలిపారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొదట దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసి ఆ తర్వాతే శాశ్వత అమలుపై నిర్ణయం తీసుకుంటామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, సరళీకరణ కోసం ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ అవసరాన్ని బట్టి వన్‌ వేల అమలును పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్‌ ను శాస్త్రీయంగా నియంత్రించేందుకు నిపుణులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా అన్ని చర్యలు చేపడతామన్నారు. మెరుగైన ట్రాఫిక్‌ నిర్వహణ, సురక్షిత ప్రయాణం కోసం వాహనదారులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు

Advertisement

లక్డీకాపూల్‌ పరిశీలన అనంతరం ఇప్పటికే వన్‌-వే అమల్లో ఉన్న కేబీఆర్‌ పార్క్‌ మార్గాన్ని సీపీ సజ్జనార్ పరిశీలించారు. అక్కడ వాహనాల రాకపోకలు మరింత సాఫీగా సాగేలా, ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వన్‌-వే మార్గమంతా బైక్‌ పై తిరిగి క్షేత్రస్థాయి పరిస్థితులు, ట్రాఫిక్‌ నిర్వహణను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేబీఆర్‌ పార్క్‌ మార్గంలో వాహనాలు ఆగకుండా సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెరుగుతున్న రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు ప్రస్తుతం ఉన్న వన్‌-వే మార్గానికి అదనంగా మరో ట్రాఫిక్‌ లేన్‌ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

Also Read: ఎఫ్‌డీఏ సంచలన నిర్ణయం.. బ్లింకిట్, జెప్టో సహా.. 105 సంస్థల ఫుడ్ లైసెన్సులు రద్దు!

అదనపు లేన్‌ ఏర్పాటుకు ఆటంకంగా మారిన భూగర్భ పైపులైన్లు, విద్యుత్‌ స్తంభాలు తదితర యుటిలిటీలను యుద్ధప్రాతిపదికన తరలించేందుకు సంబంధిత విభాగాలు తగిన చర్యలు తీసుకుంటాయని సీపీ సజ్జనార్ తెలియజేశారు. కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో వాహనదారుల ప్రయాణం సులభంగా సాగేలా ట్రాఫిక్‌ విభాగం, జీహెచ్‌ఎంసీ, నిర్మాణ సంస్థలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయని చెప్పారు.

Also Read: పులివెందులలో హోరా హోరీ.. ఆధిక్యంలో వైసీపీ పార్టీ.. వెనుకంజలో టీడీపీ!

Tags

Related News

క్రాప్ హాలిడే ఎవరిది? ఫామ్ హౌస్‌లో కూర్చున్న కేసీఆర్‌దా? ప్రభుత్వందా? ఆది శ్రీనివాస్ సంచలనం!

సర్కార్ ఆదాయ వేట.. హైదరాబాద్ పారిశ్రామిక భూములపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన!

మహిళల చేతిలో తేనె పరిశ్రమ.. గ్రామీణ వనితలకు తియ్యని ఉపాధి!

తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు.. కొత్తగా ఐదు కీలక పదవులు.. ఢిల్లీ స్థాయిలో నేతల లాబీయింగ్!

ధరణి అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ మెరుపు దాడులు.. నలుగురు అరెస్టు!

ప్రయాణికులకు దీపావళి ధమాకా.. భారీగా తగ్గిన మెట్రో, ఆర్టీసీ జాయింట్ పాస్‌ల ధరలు!

రూ.5 కోట్లు ఇస్తావా.. వీడియోలు బయట పెట్టమంటారా..? ఎమ్మెల్సీకి బెదిరింపులు.. సీన్ కట్ చేస్తే!

Big Stories

Advertisement
×