E-Paper
Advertisement

Bhoodan Land Scam: భూదాన్ కమిటీ ముసుగులో.. రూ. 3 కోట్లు వసూళ్ళు చేసిన గ్యాంగ్ అరెస్ట్!

Bhoodan Land Scam: భూదాన్ కమిటీ ముసుగులో.. రూ. 3 కోట్లు వసూళ్ళు చేసిన గ్యాంగ్ అరెస్ట్!
Advertisement

Bhoodan Land Scam: స్వేచ్చ బ్యూరో: యూసిసీఆర్ఎల్ (యంఎల్) ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారంతో మోసం చేసి వెలుగుమట్ల నిరుపేద బాధితుల నుంచి రూ. 3 కోట్లు వసూళ్ళకు పాల్పడ్డారని అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ ప్రసాదరావు తెలిపారు. మేరకు భూదాన్ యజ్ఞ బోర్డు లెర్నీడ్ స్టాండింగ్ కౌన్సిల్ సమగ్ర విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులుగా వెలుగు చూశాయని తెలిపారు. ఇప్పటికే 19 కేసుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 9 మందిని అరెస్ట్ చేసినట్లు, చట్టపరమైన చర్యలు కొనసాగుతు న్నాయని అన్నారు. భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు.

రూ.50 వేల నుంచి లక్ష..

నిందితులంతా ఒక గ్యాంగ్ గా ఏర్పడి అమాయక ప్రజలను ప్రేరేపించి, వారికి ఆశపెట్టి, భూదాన్ భూముల్లో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తామని నిరుపేద భాదితుల ఒక్కొ క్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వసూళ్లు చేశారని చెప్పారు. నిందితులు చర్యలవల్ల అనేక మంది పేదలు నిలువునా మోసపోయారని, భూదాన్ కాలనీ సభ్యుల నుంచి వసూల్ చేసిన డబ్బును వారి స్వప్రయోజనాలకు వాడుకుని, ప్రశ్నించిన వారికి భూదాన్ పట్టాలు, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని నమ్మబలికారని ఆయన పేర్కోన్నారు. ఈ ముఠా సభ్యులపై గతంలో సుమారు15 కేసులు నమోదు అయినట్టు తెలిపారు.

Advertisement

Also Read: Agriculture Drones: అన్నదాతలకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు 10 డ్రోన్లు!

కేసులు నమోదు

ఈ కేసులో దర్యాప్తు క్షేత్రస్థాయిలో కొనసాగుతోందని, ఎవరైనా బాధితులు మోస పోయినట్లయితే ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెలుగుమట్ల భూదాన్ బాధితుల నుంచి దోచుకున్న డబ్బును నిందితుల నుండి రికవరీ చేసి తిరిగి భాదితులకు అప్పగిస్తామని అన్నారు. భూదాన్ భూముల్లో అర్హులైన నిరుపేదలకు స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులపై ఖమ్మం ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్ తో పాటు సత్తుపల్లి, కొణిజర్ల పోలీస్ స్టేషన్ కూడా కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

నిందితుల్లో ఉన్నవారు..

Advertisement

తాజాగా అరెస్ట్ అయిన నిందుతుల్లో కొప్పెర వెంకన్న 42 సం, నామవరం, మోతెమండలం, సూర్యాపేట, కొట్టే బసు, 39 సం, వెలుగుమట్ల, ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామం. సంపంగి వెంకటాచలం 43 సం,గోపాలపురం,బల్లి శ్రీనివాసరావు, 45సం, వినోభా నవోదయ కాలనీ బురద రాఘవపురం ఏన్కూరు మండలం, తాళ్లూరి కృష్ణ 50 సం, కవిరాజునగర్, వినోభా నవోదయ కాలనీ, వెలుగుమట్ల,బుడిగె రాములు వెలుగుమట్ల ఖమ్మం అర్బన్, మంకిడి లింగరాజు, 66సం, లచ్చగూడెం, ఏన్కూరు మండలం, వినోభా నవోదయ కాలనీ, వెలుగుమట్ల. రాచకొండ నరసింహా చారి సహకారనగర్, భూదాన్ కాలనీ, వెలుగుమట్ల, దండా లింగయ్య 50సం, బోసు బొమ్మ సెంటర్ లు ఉన్నారు.

Also Read: Shreya Ghoshal: అసలు అమ్మాయిలు ఎక్కడున్నారు.. ఉమెన్స్ డే రోజు వైరల్ అవుతున్న శ్రేయ ఘోషల్ ఆవేదన..!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×