Guvvala Balaraju: బీఆర్ఎస్ మరో బిగ్ షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గులాబీ బాస్ కేసీఆర్‌కు పంపారు. గువ్వల బాలరాజు నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఉన్న విషయం తెలిసిందే.
గువ్వల బాలరాజు బీఆర్ఎస్‌లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన 2014 నుంచి 2023 వరకు అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ప్రభుత్వ విప్‌గా ముఖ్యమైన పాత్ర పోషించారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై 9,441 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, 2023 ఎన్నికల్లో వంశీకృష్ణ చేతిలోనే ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నారు. రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల సమయంలో ఆయన పేరు ఉన్నట్లు తెగ వార్తలు వచ్చాయి. ఇలా అప్పుడే బీజేపీ చేరుతున్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. తాజాగా గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో బీజేపీలో చేరుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ కు రాజీనామా నేపథ్యంలో గువ్వల బాలరాజు ఈ నెల 9న బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన దేశం కోసం పనిచేసే పార్టీలో చేరతానని, త్వరలో తన కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. ఈ పరిణామం బీఆర్ఎస్‌కు నష్టం కలిగించే అవకాశం ఉంది, ఎందుకంటే బాలరాజు వంటి సీనియర్ నాయకుడు పార్టీని వీడటం ప్రతిష్టను దెబ్బతీస్తుంది. బీఆర్ఎస్ నాయకత్వం ఈ రాజీనామాపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే ఇటీవలి కాలంలో పార్టీలో రాజీనామాల సంఖ్య పెరుగుతోంది. ఈ సంఘటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీసే అవకాశం ఉంది.
ALSO READ: Minister Uttam: చేసిందంతా కేసీఆరే.. ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ డిజైన్ మార్చేశారు: మంత్రి ఉత్తమ్
మాజీ సీఎం కేసీఆర్ కు పంపిన లేఖలో గువ్వల బాలరాజు కీలక విషయాలను ప్రస్తావించారు. రాజీనామా నిర్ణయం అంత ఈజీగా తీసుకున్నది కాదని అన్నారు. ఆలోచించి, ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు రాసుకొచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. గులాబీ బాస్ కేసీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు గువ్వల బాలరాజు పేర్కొన్నారు.. కష్ట సమయంలో పార్టీని వీడడం బాధగా ఉందని.. అయినా భవిష్యత్తు కోసం తప్పడం లేదని లేఖలో రాసుకొచ్చారు. అయితే గువ్వల బాలరాజు రాజీనామాపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూద్దాం…
ALSO READ: Sonu Sood: ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన రియల్ హీరో సోనూ సూద్