BRS : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి. బీఆర్ఎస్‌లో నోరున్న నేత. అధికార ప్రతినిధిగా అప్పట్లో అందరిపై విరుచుకుపడేవారు. మాటకారితనం ఎక్కువే. పవర్‌లో ఉన్నప్పుడు జీవన్‌రెడ్డి చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఏకంగా ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్నే లీజుకు తీసుకుని.. 7వేల గజాల్లో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసుకున్నారు. ప్రభుత్వానికి కొట్లల్లో పన్నులు ఎగ్గొట్టారు. ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ ఎంటర్ కావాల్సి వచ్చింది. బాకీ కట్టాలంటూ ఆ షాపింగ్ మాల్‌ను ఆర్టీసీ సీజ్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. జీవన్‌రెడ్డి అరాచకాలకు ఇదో చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి దారుణాలు ఈ గులాబీ నేత ఖాతాలో చాలానే ఉన్నాయంటారు. ఆర్మూర్‌లో ఆయనో డాన్.
114 ఎకరాలు కబ్జా.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
లేటెస్ట్‌గా మోకిలాలో వేల కోట్ల విలువ చేసే.. 114 ఎకరాల ల్యాండ్ కబ్జా కేసులో పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి. ఈ భూకబ్జా కేసు నుంచి తప్పించుకోవడానికి పెద్ద ప్రయత్నమే చేశారాయన. సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం తెగ ట్రై చేశారు. కానీ, సుప్రీం నో చెప్పింది. అరెస్ట్ నుంచి మాత్రం రక్షణ కల్పించింది. విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇక చేసేది లేక.. మోకిలా పీఎస్‌కు వచ్చారు జీవన్‌రెడ్డి. ఆయన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఇంటికెళ్లి.. ఫ్రెండ్‌షిప్ చేసి.. రియల్ వెంచర్ కబ్జా!
జీవన్‌రెడ్డిపై అనేక భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. అందులో హైదరాబాద్ శివారు శంకర్‌పల్లిలో సామా దామోదర్ రెడ్డి అనే రియల్టర్ నుంచి చాలా చాకచక్యంగా ల్యాండ్ కొట్టేసిన జీవన్‌రెడ్డి ఉదంతం బాగా పాపులర్. తన వంద ఎకరాల భూమిలో రియాల్టీ వెంచర్ చేశారు దామోదర్‌రెడ్డి. ఆ ప్లాట్లను అమ్మిపెడతానంటూ అప్పటి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సామాతో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేశారు. వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. ఆ కుటుంబంతో కలిసిపోయేవాడు. ఆ వెంచర్ తనదేనని చెబితే ఈజీగా ప్లాట్లు అమ్ముడుపోతాయని సామా దామోదర్‌రెడ్డి ఫ్యామిలీని నమ్మించి.. ఆ ప్లాట్లను తన పేరు మీద రాయించుకున్నారట జీవన్‌రెడ్డి.
జీవన్‌రెడ్డి కబ్జా తీరు ఎలా ఉంటుందంటే..
ఇంకేం.. సంతకాలు అయిపోగానే.. ఛీ పొమ్మన్నాడు. ల్యాండ్ కబ్జా పెట్టేశాడు. ఆ వెంచర్‌లోనే ఉన్న ఫంక్షన్ హాల్ కూడా తనదే అన్నాడు. సీసీకెమెరాలు, రౌడీలు, కుక్కలను కాపాలాగా పెట్టాడు. అసలు ఓనర్ దామోదర్‌రెడ్డిని ఆ దరిదాపులకు రాకుండా భయపెట్టాడు. బాధితుడు అప్పటి బీఆర్ఎస్ పెద్దల ముందు పంచాయితీ కూడా పెట్టాడు. కవిత, మైనంపల్లి, ఎర్రబెల్లిలను కలిసి కంప్లైంట్ చేశాడు. దామోదర్‌రెడ్డి నుంచి ఆక్రమించిన స్థలాన్ని అతనికి ఇచ్చేయమంటూ కవిత, మైనంపల్లిలు చెప్పినా.. జీవన్‌రెడ్డి మాత్రం కబ్జా వదలలేదు. ఆ వందల కోట్ల ఖరీదైన స్థలం ఇప్పటికీ జీవన్‌రెడ్డి గుప్పిట్లోనే ఉంది. ప్రభుత్వం మారాక.. కాస్త ధైర్యం తెచ్చుకుని సీఎం రేవంత్‌రెడ్డికి సైతం ఫిర్యాదు చేశారు బాధిత సామా దామోదర్‌రెడ్డి. అట్లుంటది మరి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి భూదందా. ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముసుగులో వందల కోట్ల అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఆయనదని.. ఆర్మూర్ డాన్ అని.. స్థానికులు జీవన్‌రెడ్డిని ఛీదరించుకుంటారు. ఎప్పటికైనా ఆయన పాపం పండుతుందని చూస్తున్నారు. లేటెస్ట్‌గా 114 ఎకరాల భూకబ్జా కేసులో ఆయన మెడకు ఉచ్చు బిగిస్తోంది.