BigTV English

Big Shock to BRS MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ.. రిమాండ్ పొడిగింపు

Big Shock to BRS MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ.. రిమాండ్ పొడిగింపు

Big Shock to BRS MLC Kavitha(Telangana news today): ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కస్టడీ ముగియండంతో ఈ ముగ్గురిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అయితే, ఆగస్టు 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.


లిక్కర్ స్కాం కేసులో కవిత మార్చి 16న అరెస్ట్ అయ్యారు. అప్పటినుంచి ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు. అయితే, పలుమార్లు ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా కోర్టు తీరస్కరిస్తూ వస్తుంది. బుధవారంతో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుండడంతో అధికారులు ఆమెను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు.

కేసు విచారణ కీలక దశలో ఉన్నందున..కవిత రిమాండ్ ను పొడిగించాలని ఈడీ కోర్టును అభ్యర్థించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు..కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Also Read: రేవంత్ రెడ్డి నాకు మిత్రుడే.. పదేళ్ల కిందటి నుంచే చెడింది: అసెంబ్లీలో కేటీఆర్

లిక్కర్ స్కాం కేసులో కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఏ17గా కవితను సీబీఐ ఛార్జ్ షీట్‌ లో చేర్చింది. అయితే ఈ ఛార్జ్ షీట్ స్క్రూటీనీకి కవిత తరఫు న్యాయవాది సమయం కోరారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని జడ్జి కావేరి బవేజా చెప్పారు. ఈ క్రమంలో విచారణ ను ఆగస్టు 9కి వాయిదా వేశారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×