BigTV English

Sanju Samson: సంజూ శాంసన్ కి ఏమైంది?

Sanju Samson: సంజూ శాంసన్ కి ఏమైంది?

Sanju Samson bad performance in India vs Sri Lanka T20I Match: టీమ్ఇండియాలో దురదృష్టవంతుడైన ఆటగాడు ఎవరంటే సంజూ శాంసన్ అనే చెప్పాలి. తనకిలా ఎన్నో అవకాశాలు వచ్చాయి. రంజీలు, ఐపీఎల్ మ్యాచ్ ల్లో అద్భుతంగా ఆడటం, ఒంటి చేత్తో మ్యాచ్ లను గెలిపించడం తనకు మంచినీళ్ల ప్రాయం. అలాంటిది జాతీయ జట్టులోకి వచ్చి, ఆ ఒత్తిడి వల్ల మరేమిటో తెలీదు. వచ్చిన అవకాశాలను వృధా చేసుకుంటూ ఉంటాడు.


మూడో టీ 20లో శ్రీలంక ఓపెనర్ పెరీరా క్యాచ్ మిస్ చేశాడు. తర్వాత అతను పాతుకుపోయి ఇండియాని టెన్షన్ పెట్టాడు. అయితే మళ్లీ తనే వికెట్ల వెనుక అద్భుతంగా కీపింగ్ చేసి రెండు అవుట్లు చేసి, గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

బయట పోటీ విపరీతంగా ఉంది. అవకాశాల కోసం యువ క్రీడాకారులు ఆవురావురుమంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన సంజూ శాంసన్ వెనుకపడిపోతున్నాడు. ఐపీఎల్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తను ఒంటరిగా నిలిచి ఆడే తీరు అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఆట ఇప్పుడెందుకు ఆడటం లేదని అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.


శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో గోల్డెన్ డక్ అయిన సంజూ శాంసన్.. మూడో టీ20లో.. పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. 29 ఏళ్ల సంజూ శాంసన్ కి ఇంకా క్రికెట్ ఆడే వయసు చాలా ఉంది. కేరళ రాష్ట్రానికి చెందిన సంజూ సొంత ఊరు త్రివేండ్రం దగ్గర ఫుల్లువిలా. ఆ మారుమూల ప్రాంతం నుంచి ఎంతో కష్టపడి క్రికెట్ నేర్చుకుని, జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

అన్ని మెట్లు ఎక్కి, చివరి మెట్టు దగ్గర సంజూ బోల్తా కొడుతున్నాడు. ఇప్పటికి 16 వన్డేలు ఆడి 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలున్నాయి. ఇప్పటివరకు 30 టీ 20లు ఆడాడు. 444 పరుగులు చేశాడు. 2 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 77గా ఉంది.

Also Read: లీగల్ నోటీసులు ఇచ్చిన.. మను బాకర్ టీమ్

ఓవైపు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ రీ ఎంట్రీ తనకి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు యువ వికెట్ కీపర్లు ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మలతో పోటీ ఏర్పడింది. మధ్యలో రియాన్ పరాగ్ ఆల్‌రౌండర్ ఎదుగుతున్నాడు. ఇలా సంజూ శాంసన్‌కు జట్టులో దారులు మూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే వికెట్ కీపర్‌గా కాకున్నా.. మంచి బ్యాటర్ గా మారేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే టీ20లకు విరాట్ కొహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో మిడిల్ ఆర్డర్ వీక్ గా ఉంది. ఈ ప్లేస్ ని సంజూ అందిపుచ్చుకునే అవకాశం ఉంది. దానిని కూడా నేలపాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు తన చెత్త ప్రదర్శన.. టీమిండియాకు దూరం చేసేలా ఉందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే సిరీస్ ల్లో సంజూ భవిష్యత్తు గౌతం గంభీర్, సూర్యకుమార్ చేతుల్లో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×