BigTV English

Kerala Health Minister Accident: వయనాడ్ వెళ్తుండగా మంత్రి కారుకి ప్రమాదం.. స్వల్ప గాయాలు

Kerala Health Minister Accident: వయనాడ్ వెళ్తుండగా మంత్రి కారుకి ప్రమాదం.. స్వల్ప గాయాలు

Veena george accident news(Telugu news headlines today): వయనాడ్ లో వరద పరిస్థితి సమీక్షించేందుకు వెళుతున్న కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి కారు ప్రమాదానికి గురయ్యారు. మళ్లప్పురం జిల్లా మంజేరి సమీపంలో ఈ ప్రమాదం బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో మంత్రి వీణా జార్జికి స్వల్ప గాయాలు కాగా.. ఆమె ప్రస్తుతం.. మంజేరి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారని స్థానిక పోలీసులు తెలిపారు.


స్థానికి మీడియా కథనం ప్రకారం.. ఆరోగ్య మంత్రి వీణాజార్జి ప్రయాణిస్తున్న కారు.. మంజేరీ సమీపంలో ఒక బైక్ ని ఢీ కొట్టిన తరువాత ఒక కరెంటు పోలో ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి జార్జికి తల, చేతి భాగాలపై గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆమె.. సాయంత్రం తిరిగి ప్రయాణం చేసి వయనాడ్ చేరుకుంటారని సమాచారం. ప్రమాదానికి గురైన బైక్ పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయని.. అతనికి కూడా ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.

Also Read: ‘మీ బట్టలు సరిగా లేవు బయటికి వెళ్లండి’.. మహిళను గెంటేసిన రెస్టారెంట్ ఓనర్


వయనాడ్ లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల 145 మందికి పైగా మరణించారు. మరో 120 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ఇళ్లు, భవనాలు కూలిపోవడంతో చాలా మంది ఇంకా శిథిలాల కిందనే చిక్కుకొని ఉన్నట్లు తెలుస్తోంది. కొండప్రాంతమైన వయనాడ్ లో 2011 జనాభా గణన ప్రకారం.. 8 లక్షల మందికి పైగా నివసిస్తున్నారు.

వయనాడ్ లో మరో 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ అలర్డ్ జారీ చేసింది.

Also Read : కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టం తీసుకొస్తాం’.. ఢిల్లీ మంత్రి ఆతిషి

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×