E-Paper
Advertisement

Rave party at hyderabad: బిగ్ బాస్ మెహబూబ్ బర్త్ డే.. రేవ్ పార్టీలో అడ్డంగా దొరికేశాడుగా..

Rave party at hyderabad: బిగ్ బాస్ మెహబూబ్ బర్త్ డే.. రేవ్ పార్టీలో అడ్డంగా దొరికేశాడుగా..
Advertisement

Rave party at hyderabad: హైదరాబాద్‌లో రేవ్ పార్టీ కల్చర్ క్రమంగా పెరుగుతోంది. వీకెండ్ వస్తే కొందరు యువకులు పార్టీల పేరుతో నానాహంగామా చేస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో భారీగా మందు పట్టుబడింది. ఈ పార్టీకి కొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు. కొందర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, మరికొందరిపై కేసులు నమోదు చేశారు.

సోమవారం బిగ్‌బాస్ ఫేం మెహబూబ్ షేక్ బర్త్ డే. ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేయడంతో పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ అయితే లేనిపోని సమస్యలు వస్తాయని భావించాడు. పార్టీకి వేదికగా మేడ్చల్‌లోని ఘట్కేసర్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఓ రిసార్టులో పార్టీని గ్రాండ్‌గా అరేంజ్ చేశాడు. మెహబూబ్ ఫ్రెండ్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

Advertisement

రిసార్ట్‌లో రేవ్ పార్టీ జరుగుతున్న విషయం పోలీసుల చెవిలో పడింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నైట్ మెరుపుదాడి చేశారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంపై ఆర్గనైజర్లతోపాటు పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు.

ALSO READ: ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ.. రిమాండ్ పొడిగింపు

Advertisement

రేవ్ పార్టీలో 10 లీటర్ల లిక్కర్, ఐదు లీటర్ల బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరిని అరెస్ట్ చేశారన్న విషయాలు పోలీసులు బయటపెట్టలేదు. కొందరు అమ్మాయిలు, యువకులు పట్టుబడినట్టు అంతర్గత సమాచారం. వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

బుల్లితెరకు చెందిన పలువురు ఈ పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రేవ్ పార్టీలో బడా సెలబ్రిటీ లున్నట్లు భావిస్తున్నారు. మరి విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×