BigTV English

Bigtv Free Medical Camp: తెలంగాణలో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 27 నుంచి.. వివరాలు ఇవిగో

Bigtv Free Medical Camp: తెలంగాణలో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 27 నుంచి.. వివరాలు ఇవిగో

Bigtv Free Medical Camp: తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ కొద్దిరోజులుగా ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ మెడికల్ క్యాంపుల్లో అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి.. మందులు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా.. ఈ నెల 27,28,29 తేదీల్లో సంగారెడ్డి, నల్గొండ, జహీరాబాద్, నర్సంపేట నియోజకవర్గాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది.


సెప్టెంబర్ 27న..

సంగారెడ్డి జిల్లా.. జహీరాబాద్ లో బిగ్ టీవీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనుంది. ఈ నెల 27న బాలాజీ హాస్పెటల్ వారి సహకారంతో.. కె జి ఎన్ ఫంక్షన్ హాల్ శాంతి నగర్ లో నిర్వహిచబడును. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫ్రీ మెడికల్ క్యాంపులు జరుగుతాయి. మెగా వైద్య శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, మందులు పంపిణీ చేస్తారు. ఈ వైద్య శిబిరాన్ని జహీరాబాద్ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు.


సెప్టెంబర్ 28న..

సంగారెడ్డి జిల్లా.. సదాశివపేట లో 28న బిగ్ టీవీ.. బాలాజీ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనుంది. బసవ సేవ సాధన్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

హాజరు కానున్న ప్రముఖులు
ఎమ్మెల్యే చింత ప్రభాకర్
టి జి ఐఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి.
ఎస్పీ చెన్నూరి రూపేష్.
డాక్టర్ శ్రీధర్. బాలాజీ హాస్పిటల్
డాక్టర్ గాయత్రి దేవి
మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్
కాన్సిల్ సభ్యులు.
పోలీస్ ఉన్నతాధికారులు

ఈ ఉచిత వైద్య శిబిరంలో.. ఉచిత పరీక్షలు నిర్విహించి.. మందులు పంపిణీ చేయనున్నారు. బీపీ, జి ఆర్ బి ఎస్, ఈ సి జి ,2dకో, వీడియో రెక్టోస్కోపీ పరీక్షలు చేస్తారు. కార్డియాలజీ డాక్టర్స్, గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్స్, గైనకాలజీ డాక్టర్స్, జనరల్ మెడిసిన్ డాక్టర్స్, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్స్ ఉంటారు.

ధర్మపురిలో..

ధర్మపురి లక్ష్మీ నరసింహ క్షేత్రం లో బిగ్ టివి మెగా హెల్త్ క్యాంపు జరగనుంది. ఈ నెల 28 న బిగ్ టివి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్వర్యంలో.. కరీంనగర్ రెనీ హాస్పిటల్ సహకారంతో మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం జరగనుంది.

Also Read: ఆంధ్రప్రదేశ్ లో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 28,29 తేదీల్లో.. వివరాలు ఇవిగో

సెప్టెంబర్ 29న..

నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలంలోని లింగాపురం గ్రామ పంచాయతీ వద్ద.. బిగ్ టీవీ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించనుంది. లలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో.. ఈ నెల 29, ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ మెడికల్ క్యాంపు జరుగుతుంది.

గైనిక్, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్ డాక్టర్లతో.. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి.. మందులు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ వైద్యులతో పాటు చిన్నపిల్లల ప్రత్యేక వైద్యులు, స్త్రీ వైద్య నిపుణులు ఉచిత వైద్య సేవలు అందిస్తారు.

దేవరకొండలో..

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గలో బిగ్ టీవీ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తోంది. జైరాం హాస్పటల్ సౌజన్యంతో.. గుర్రపుతండా గ్రామ పంచాయితీ ఆవరణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారు.

 

 

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×