Prabhas donation of Rs 2 crore for Wayanad victims: కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో ఇటీవల జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. యావత్ దేశాన్ని కుదిపేసింది. భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లా అతలాకుతలం అయింది. కొండచరియలు విరిగిపడటం, వరదలు బీభత్సం సృష్టించడంతో జిల్లాలో నాలుగైదు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఈ ఊహించని విపత్తులో ఎంతో మంది ప్రాణాలు విడిచారు. దాదాపు 350 కి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరెందరో శిథిలాల కింద సజీవ సమాధి అయిపోయారు. ఇంకెందరో హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఈ విషాద ఘటన అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటనతో వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమ వంతు సాయం అందించారు. ఇక ఇప్పుడు మరో హీరో సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం అందించాడు. ఏకంగా రూ.2 కోట్లు ప్రకటించాడు. దీంతో అతడి సాయానికి అభిమానులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వయనాడ్ విలయం.. చిరు, చరణ్ భారీ విరాళం..
కాగా ప్రభాస్‌కు ముందు చాలా మంది సెలబ్రిటీలు తమ వంతు సాయంగా లక్షలు, కోట్లలో విరాళాలు అందించారు. ఈ ప్రకృతి విపత్తు వారిని ఎంతో కలిచి వేసింది. అందుకోసమే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, అతడి వైఫ్ జ్యోతిక, అతడి తమ్ముడు కార్తీ వయనాడ్ బాధితుల కోసం ఏకంగా రూ.50 లక్షలు ప్రకటించారు. అలాగే మరో తమిళ స్టార్ హీరో విక్రమ్ తన వంతు సాయంగా రూ.20 లక్షలు ప్రకటించాడు. రష్మిక రూ.10 కోట్లు విరాళంగా అందించింది.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ రూ.3 కోట్లు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేశాడు. అంతేకాకుండా ఒక స్కూల్ నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్నాడు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇటీవల రూ.25 లక్షల సాయం చేశాడు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ.1 కోటి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేటో చేశారు. ఇలా ఎవరికి తోచిన సాయం వారు చేసి మంచి మనసు చాటుకుంటున్నారు.