BigTV English

MP Konda Vishweshwarreddy: లైన్ క్లియర్ చేస్తున్న బీజేపీ, ఎంపీ కొండాకు కలిసొచ్చిన ఛాన్స్

MP Konda Vishweshwarreddy: లైన్ క్లియర్ చేస్తున్న బీజేపీ, ఎంపీ కొండాకు కలిసొచ్చిన ఛాన్స్

MP Konda Vishweshwar reddy latest news(Telangana politics): వచ్చేనెలలో తెలంగాణ అధ్యక్షుడ్ని ప్రకటించబోతోంది బీజేపీ హైకమాండ్. బలమైన సామాజిక వర్గాల నుంచి ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్త తీసుకుంటోంది. ఈ క్రమంలో కులాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇందులోభాగంగానే తెలంగాణలో బలమైన రెడ్డి సామాజికవర్గంపై కన్నేసింది.


తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో‌ భాగంగా అగ్రకులాలపై కన్నేసింది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా రెడ్డి సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని, లేకుంటే కష్టమన్నది బీజేపీ పెద్దలకు క్లియర్‌గా అర్థమైంది. ఈ క్రమంలో ఆ వర్గానికి కేంద్రంలో ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.

ఇప్పటికే సీనియర్ నేత కిషన్‌రెడ్డిని మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన బండి సంజయ్‌కు సైతం మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇక చేవెళ్ల ఎంపీగా గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డికి బీజేపీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. లోక్‌సభలో ఆ పార్టీ విప్‌గా నియమించింది. దీంతో తెలంగాణలో రెడ్డి కమ్యూనిటీకి తాము ప్రయార్టీ ఇస్తున్నామనే సంకేతాలు కేడర్‌కి పంపినట్లైంది.


తెలంగాణ అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్ ఉన్నారు.కొండాకు విప్ పదవి ఇవ్వడంతో ఈటెలకు దాదాపు లైన్ క్లియర్ అయ్యిందని ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకువచ్చింది. రేపోమాపో ఈటెలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించడం ఖాయమనే చర్చ అప్పుడే ఆ పార్టీలో మొదలైంది. ఇంతవరకు బాగానే ఎస్టీ, ఎస్సీల మాటేంటన్నది అసలు ప్రశ్న. వీరికి ఛాన్స్ ఇవ్వకుంటే కష్టమన్నది ఆ పార్టీలో కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

ALSO READ: మంత్రి సీతక్కపై పాడి కౌషిక్ రెడ్డి వ్యాఖ్యలు.. అసెంబ్లీలో దుమారం

మొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటినుంచి బీజేపీ రూట్‌క్లియర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీలో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×