Satyabhama Today Episode November 18 th : గత ఎపిసోడ్ లో.. సత్య క్రిష్ పుట్టుక గురించి తెలుసుకోవాలని హాస్పిటల్ కి వెళుతుంది కానీ అక్కడ మహాదేవయ్య చక్రవర్తి పేర్లు మాత్రమే ఉండడంతో షాక్ అవుతుంది. దాని గురించి ఆలోచిస్తూ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే ఆలోచనలో ఉంటుంది. అప్పుడు క్రిష్ ఆ ఇద్దరిలోనే మార్పిడి జరిగిందని ఒక సలహా ఇస్తాడు. ఆ తర్వాత రోజు సంజయ్ క్రిష్మధ్య గన్ పోటీ జరుగుతుంది. సంజయ్ కృష్ణ నువ్వా నేనా అని పోటీ పడతారు. వీరిద్దరికీ ఏమవుతుందని వీరిద్దరి తండ్రులు టెన్షన్ పడతారు. మొత్తానికి వీరిద్దరికి ఏం కాకుండా గన్ గేమ్ అయితే పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. హర్ష విశాలాక్షి వాళ్ల నాన్న మాట్లాడుకునే మాటలను ఇచ్చి వింటుంది. వీళ్లు నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తున్నారు కానీ వీళ్ళ నుంచి నేనే వెళ్ళిపోవాలని మైత్రి డిసైడ్ అవుతుంది. ఉదయం లేవగానే మైత్రి బ్రీఫ్ కేస్ తో అక్కడికి వస్తుంది. నందిని చూసి ఏంటి మైత్రి మాకు చెప్పకుండా ఫారిన్ పోవాలని చూస్తున్నావా అని అడుగుతుంది. ఫారిన్ కాదు నందిని నేను మా ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నాను ఇప్పటికే నేను మీకు చాలా చేశాను. నాకోసం మీరు చాలా ఖర్చు పెట్టారు ఇక మీద నుంచి మీకు భారం కాకుండా ఉండాలని నేను వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఆ మాట వినగానే నందిని ఫుల్ ఖుషి అవుతూ మనసులో సంతోషపడుతుంది. ఇన్నాళ్లకు దీని పీడ విరగడ అయిపోతుంది నా పెనిమిటి ఇంకా నా మాటలే వింటాడు అని సంతోషపడుతుంది. అవునా మైత్రి నువ్వు నిజంగానే వెళ్లాలనుకుంటున్నావా ఇన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉంటే ఈ ఇల్లు నీదే అనుకున్నాను కాదు కదా నీకంటే ఒక ఇల్లు ఉంది కదా అని మైత్రిని తక్కువ చేసి మాట్లాడుతుంది నందిని.
ఇక సంధ్య మాత్రం ఇంత సడన్గా ఏంటి మైత్రి నీ తలకు తగిలిన గాయమైన తగ్గేంత వరకు ఉండు అని అడుగుతుంది. దానికి నందిని తలకు తగిలిన గాయం ఏంటి అది ఒక ఆయింట్మెంట్ రాస్తే పోతుంది అనేసి అంటుంది.. ఇక మైత్రి కూడా హర్ష దగ్గరికి వెళ్లి నేను వెళ్లాలనుకుంటున్న హర్ష నువ్వు ఉండిపొమ్మంటే ఉంటాను కానీ నేను వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నేను వెళ్ళిపోతాను అని కాసేపు మాట్లాడుతుంది. ఇకనందిని వదిలి పెట్టేసి రాపో అనేసి హర్షతు అంటుంది. హర్ష మైత్రిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే మైత్రి తన తల్లిదండ్రుల ఫోటో చూసి ఎమోషనల్ అవుతుంది. అందుకే మైత్రి నిన్ను ఆపలేను ఉండమని చెప్పలేను అనేసి హర్ష అంటాడు. నువ్వు ఇచ్చిన ధైర్యం ఉంది హర్ష ఇక జీవితాంతం బతికేస్తాను అని మైత్రితో అంటాడు. ఇక ప్రతిరోజు ఏదో ఒక వంకతో నిన్ను ఇక్కడికి పిలుస్తాను అని మైత్రి మనసులో అనుకుంటుంది. నీకు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చెయ్ నేను వస్తానని హర్ష అంటాడు.
అటు సత్య క్రిష్ తండ్రి చక్రవర్తి మావయ్య నాని ఆలోచిస్తుంది. తెలిసి జరిగిందా తెలియక జరిగిందా మహదేవయ్య ఏదైనా ప్లాన్ వేశాడా అని ఆలోచిస్తుంది. ఇక రేణుక కొబ్బరికాయ కొడుతుంటే క్రిష్ వచ్చి ఆ కొబ్బరికాయ నాకు ఇవ్వు వదినా నేను కొడతానని కొబ్బరికాయ తీసుకొని కొడుతూ ఉంటాడు. అంతలోకే చక్రవర్తి అక్కడికి వచ్చి క్రిష్ ఏదైనా రాయితో కానీ బలమైన వస్తువుతో కానీ కొట్టు చెయ్యికి దెబ్బ తగులుతుంది రక్తం వస్తుంది అని అంటాడు. బాబాయ్ ఇది నాకు ఒక లెక్క కాదు అని క్రిష్ చేతితోనే కొడితే చెయ్యికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. చక్రవర్తి క్రిష్ పై చూపిస్తున్న ప్రేమను చూసి సత్య క్రిష్ నిజంగానే తన కొడుకుని కన్ఫామ్ చేసుకుంటుంది. ఇది చిన్న మామయ్యకి తెలుసు జరిగిందా తెలియక జరిగిందనేది తెలుసుకోవాలి మావయ్య నే అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో సత్య అసలు నిజం తెలుసుకుంటుందా? మహదేవయ్య వేసిన మరో ప్లాన్ లో అడ్డంగా ఇరుక్కుంటుందనేది చూడాలి..