Laxman : మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన మొత్తం కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం తెరాసదే అన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్లు.. మొయినాబాద్ సీన్ ఫెయిల్ అయిందన్నారు. ముగుగోడులో తెరాసకు ఓటమి తప్పదని తెలిసే టీఆర్ఎస్ ఈ స్టోరీ క్రియేట్ చేసిందన్నారు. దేశంలో చాలా చోట్ల ఉపఎన్నికలు జరుగాయి.. కానీ మునుగోడులో 83 ఎమ్మెల్యేలు మోహరించినట్లు ఎక్కడైనా జరిగింది.
ఇలాంటివి ఇంకెన్ని కథలు అల్లుతారో వేచిచూడాలన్నారు. గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యా యత్నం రిగిందని అన్నారు. ఆ హత్యాయన్నం నిందితులే శ్రీనివాస్ గౌడ్‌తో ప్లీనరీలో సెల్ఫీలు దిగారు. మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోయినా ప్రభుత్వ మార్పు జరగదు.. అలాంటప్పుడు టీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు లక్ష్మన్. కట్టుకథలతో ప్రజల దృష్టిని టీఆర్ఎస్ మారుస్తోంది. ఎంపీ కిషన్ రెడ్డి కూడా ఈ దంతంపై తీవ్రంగా స్పందించారు. ఎంత డబ్బు పోలీసులకు దొరికిందో స్పష్టం చేయాలని అన్నారు.