500 Years Old Hanuman Idol : భారత్‌కు చెందిన పురాతన హనుమాన్ విగ్రహాన్ని గతంలో ఆస్ట్రేలియ స్వాధీనం చేసుకుంది. 500 ఏళ్లనాటి ఈ విగ్రహాన్ని అమెరికా తిరిగి భారత్‌కు అప్పగించనుంది. అమెరికా విదేశాంగ శాఖ వాషింగ్టన్‌లో దీపావళి వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల్లో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింెన్ పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న వివిధ సంస్కృతులకు సహాయాన్ని అందించి వాటిని కాపాడ్డానికి కృషి చేస్తామన్నారు. 500 ఏళ్లనాటి హనుమాన్ విగ్రహాన్ని దొంగలించి ఆక్షన్ సంస్థకు అమ్మివేస్తే.. దాన్ని స్వాధీనం చేసుకొని మళ్లీ భారత్‌కు అప్పగించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
గతంలో దక్షిణ భారత దేశంలో ఈ 500ల ఏళ్ల నాటి హనుమాన్ విగ్రహం చోరీకి గురైంది. దొంగలించిన వ్యక్తి.. ఈ విగ్రహాన్ని అమెరికాలోని క్రిస్టినీ ఆక్షన్ సంస్థకు అమ్మివేసారు. తరువాత వేలంపాటలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్వక్తి దీన్ని కొనుగోలు చేశాడు. తరువాత అమెరికా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆ విగ్రహం దొంగలించబడిందని నిర్ధారించుకొని ఆస్ట్రేలియా అధికారులను అప్రమత్తం చేశారు. ఇరు దేశాల సహాకారంతో ఆ పురాతన హనుమాన్ విగ్రహాన్ని అమెరికా విదేశాంగ శాఖ స్వాధీనం చేసుకుంది. త్వరలోనే ఈ విగ్రహాన్ని భారత్‌కు అప్పగించడానికి సన్నద్ధమయింది.