EPAPER

Munugode : ఎమ్మెల్యేలకు కరోనా.. మునుగోడులో కలకలం.. స్థానికుల్లో టెన్షన్

Munugode : ఎమ్మెల్యేలకు కరోనా.. మునుగోడులో కలకలం.. స్థానికుల్లో టెన్షన్

Munugode : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీల నేతలు నియోజకవర్గంలో నానాహంగామా చేస్తున్నారు. ర్యాలీలు, మీటింగ్ లు, దావత్ లతో ధూంధాం చేస్తున్నారు. డబ్బులు బాగా వస్తుండటంతో.. స్థానికులు పెద్ద సంఖ్యలో నేతల వెంట తిరుగుతున్నారు. ఇదే ఇప్పుడు కొంపముంచేలా ఉంది. కరోనా వ్యాప్తికి మంచి వేదికగా మారింది. లేటెస్ట్ గా ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొవిడ్ పాజిటివ్ రావడంతో అంతా ఉలిక్కిపడుతున్నారు. వామ్మో.. మళ్లీ కరోనానా? అంటూ హడలిపోతున్నారు.


ప్రస్తుతం కరోనా వ్యాప్తి కంట్రోల్ లోనే ఉంది. అతిస్వల్పంగా మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఖతం అయిందనే భావనలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. మాస్కులు పెట్టుకునే వారే లేరు. పొరబాటున ఎవరైనా మాస్క్ పెట్టుకుంటే వారి వైపు విచిత్రంగా చూస్తున్నారు. ఇక మునుగోడులో ఎటు చూసినా గుంపులు గుంపులుగా జనాలే. ర్యాలీలు, రోడ్ షోలు, పార్టీలతో నియోజకవర్గంలో భారీగా జనం పోగవుతున్నారు. ఇదే ఇప్పుడు కరోనా వ్యాప్తికి ప్రమాదకర అంశంగా మారుతోంది.

తాజాగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలకు కరోనా సోకడం కలకలంగా మారింది. సుధీర్ రెడ్డి అయితే ఏకంగా నాలుగోసారి కొవిడ్ బారినపడ్డారు. వీరిద్దరూ కొన్నిరోజులుగా మునుగోడులో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. వీళ్లిద్దరికి పాజిటివ్ రావడంతో.. ఇన్నాళ్లూ వారి వెంట తిరిగిన కార్యకర్తలు, అభిమానులు భయపడిపోతున్నారు. ర్యాపిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు.


ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిందంటే.. ఎలాంటి సింప్టమ్స్ లేకుండా ఇంకా ఎంతమంది కొవిడ్ బారిన పడ్డారో అనే అందోళన వ్యక్తం అవుతోంది. అసలే ఎలక్షన్ టైమ్. ఎటు చూసినా హోరాహోరీ ప్రచారం. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తే ఇంకేమైన ఉందా? క్యాంపెయిన్ లో సోషల్ డిస్టెన్స్ పాటించే అవకాశం లేకపోయినా.. కనీసం మాస్కులు ధరించైనా కాస్త సేఫ్ గా ఉండాలి. వ్యాక్సిన్ వేసుకున్నా.. జాగ్రత్తలు పాటించాలి. ముందుముందు ప్రచారం మరింత హోరెత్తనుండగా.. ఇలాంటి సమయంలో కరోనా న్యూస్.. షాకింగ్ న్యూసే. మునుగోడు ప్రజలారా.. బీ కేర్ ఫుల్.

Tags

Related News

Eluru News: దీపావళి రోజు అపశృతి.. అదుపుతప్పిన బైక్.. పేలిన ఉల్లిపాయ బాంబులు.. ఒకరు అక్కడికక్కడే మృతి

MP Raghu Comments : కేసీఆర్ ఫామ్ హౌస్ లో, కేటీఆర్ పార్టీల్లో.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అలా చేస్తే ఊరుకోం

Janwada Case: జన్వాడ కేసులో బిగ్ ట్విస్ట్.. రాజ్‌కు 2 రోజుల గడువిచ్చిన హైకోర్టు, విచారణకు విజయ్ గైర్హాజరు, వాట్ నెక్ట్స్?

Tirumala: నవంబర్ నెలలో తిరుమలకు వెళ్తున్నారా.. టీటీడీ చేసిన ఈ ప్రకటన మీకోసమే.. దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

Minister Durgesh: గోదావరి అందాలకు కొత్త సోయగం.. దేశంలోనే ప్రప్రధమంగా ఏర్పాటు.. ఒక్కసారి షికార్ చేశారో మళ్లీ.. మళ్లీ.. మంత్రి దుర్గేష్

Janvada Farm House: జన్వాడ రేవ్ పార్టీ కేసులో అన్నీ సంచలనాలే.. ఫామ్ హౌస్ సీజ్ చేసే అవకాశం.. కేటీఆర్ ఏమయ్యారు?

World Justice Project : పాకిస్థాన్ ఓ చెత్త దేశం… అక్కడ బతకడం ఎంత కష్టమో ఈ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది

×