MLA Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ వార్తల్లోకి వచ్చేవారు. కొన్నాళ్లుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఆయన ఎప్పటికప్పుడు బయటపెడుతున్నారు. ఆయనపై జరుగుతున్న కుట్రలను సైతం బహిర్గతం చేస్తున్నారు. అయినా ఏ ఒక్క నేత కనీసం స్పందించలేదు.
తాజాగా మరోసారి హాట్ కామెంట్స్ చేశారాయన. బీజేపీలో తనను వెన్నుపోటు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రాజాసింగ్. తనపై పీడీ యాక్ట్ నమోదు కావడానికి, జైలుకు పంపించడానికి మాపార్టీ నేతలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు నేతలు పోలీసులతో కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అరెస్టు సమయంలో ఓ పోలీసు అధికారి తనతో చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు సదరు ఎమ్మెల్యే. రాజాసింగ్‌కు మద్దతుగా ఉన్న అన్న ఎవరని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు ఆయన మద్దతు ఇవ్వలేదన్నారు? పెద్దన్న ఇప్పుడు ఎటు వైపు ఉన్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. రాజా సింగ్ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
ఇదే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశారాయన. కేటీఆర్ ఆదేశాలతో ఒకప్పుడు పోలీసులు రేవంత్‌రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారని అన్నారు. ఆయన బెడ్ రూమ్ లోపలికివెళ్ళి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి జైలుకి పంపారని గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అరెస్టు చేసిన వాళ్ళపై ఎలాంటి కక్ష్యసాధింపు చేయలేదన్నారు.
ALSO READ: ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యం
ఎవరి అధికారం ఉంటే వాళ్ళ మాటనే వింటారన్నారు. లీగల్‌గా పోలీసులు వారి పని చేస్తారని చెప్పుకొచ్చారు రాజాసింగ్. ఈ విషయాన్ని కేటీఆర్ మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. పోలీసులతో పెట్టుకోవద్దు, కక్ష్యపూరిత రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి కక్షపూరిత రాజకీయాలు చేయమన్నారు.
బీజేపీ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నారని, చివరకు లాఠీఛార్జ్ చేశారని గుర్తు చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఇలా సమయం దొరికిన ప్రతిసారీ తన గోడు వెల్ల బోసుకుంటున్నారు. ఇంతకీ ఆ పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక.