BigTV English

BJP: మిషన్ 90.. బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ.. 10 నెలలు బిజీ బిజీ..

BJP: మిషన్ 90.. బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ.. 10 నెలలు బిజీ బిజీ..

BJP: కమలనాథులు కాక మీదున్నారు. ఈసారి కేసీఆర్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఎప్పటి నుంచో తెలంగాణపై ఫోకస్ చేసినా.. ఫాంహౌజ్ కేసులో నేరుగా బీఎల్ సంతోష్ ను టార్గెట్ చేయడంతో.. ఇక తఢాకా చూపించాలని డిసైడ్ అయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోషే నేరుగా రంగంలోకి దిగారు. హైదరాబాద్ వచ్చి మరీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు.


క్షేత్ర స్థాయిలో రాజకీయం చేయడంలో బీజేపీ దిట్ట. ఆ పార్టీ పోల్ మేనేజ్ మెంట్ పక్కాగా ఉంటుంది. బూత్ లెవెల్ లో రాజకీయం చేస్తుంటారు. 10 మంది ఓటర్లకో పార్టీ బాధ్యుడిని కేటాయిస్తుంటారు. అలా అలా అంచలంచెలుగా పార్టీ ప్రచారం జరుగుతుంటుంది. ఎప్పటి నుంచో బీజేసీ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది. ఈ బేసిక్ ఫార్ములాతో పాటు తెలంగాణ కోసమే ప్రత్యేకంగా రోడ్ మ్యాప్ రెడీ చేశారు బీజేపీ అగ్రనేతలు.

కేసీఆర్ సర్కారును అన్నిరకాలుగా కార్నర్ చేసేలా.. పార్టీని అన్ని నియోజకవర్గాల్లో పటిష్టం చేసేలా.. కార్యచరణ సిద్ధమైపోయింది. సభలు, సమావేశాలు, ఛార్జిషీట్లుతో రానున్న 10 నెలలు నిత్యం ప్రజల్లో ఉండేలా రూట్ మ్యాప్ రచించారు. దానికి బీఎల్ సంతోష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇక కమలనాథులు కదనరంగంలోకి దిగడమే తరువాయి.


–తెలంగాణలో బీజేపీ మిషన్ 90 కార్యచరణ
–10 నెలల రోడ్ మ్యాప్.. ఎలక్షన్ క్యాలెండర్ సిద్ధం
–జనవరి చివరి నుంచి బండి సంజయ్ పర్యటనలు, సభలు
–సంక్రాంతి తర్వాత నుంచి 10 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్
–ఫిబ్రవరి 15న మోదీ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం
–ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ స్థాయి సమావేశాలు
–మార్చి నుంచి పార్లమెంట్ స్థానాల్లో బహిరంగ సభలు
–మార్చి 5నుంచి జిల్లా స్థాయి సమావేశాలు
–ఏప్రిల్ లో ప్రభుత్వంపై బీజేపీ ఛార్జిషీట్
–ఏప్రిల్ లో ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ సభ

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×