E-Paper
Advertisement

Telangana Elections : జనసేనతో పొత్తు.. బీజేపీ స్కెచ్ ఇదేనా?

Telangana Elections : జనసేనతో పొత్తు.. బీజేపీ స్కెచ్ ఇదేనా?
Advertisement

Telangana Elections : తెలంగాణలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌కు గండికొట్టేలా బీజేపీ స్కెచ్ వేసిందా? బీఆర్‌ఎస్‌కు మేలు జరిగినా ఫరవాలేదు.. కాంగ్రెస్‌ లాభపడొద్దనేలా బీజేపీ వ్యూహం రచించిందా? ఔననే అంటున్నాయి రాజకీయవర్గాలు. తెలంగాణలో పవన్‌తో బీజేపీ పొత్తు అందులో భాగమేననే చర్చ జరుగుతోంది.

ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీ, బీజేపీలపై కమ్మ సామాజికవర్గం కోపంగా ఉందని, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లో ఆందోళనలు కూడా చేయనివ్వకపోవడంపైనా తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని అంటున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు డ్యామేజ్ కంట్రోల్‌కు దిగినా… కమ్మ సామాజికవర్గంలో కోపం తగ్గలేదనే చర్చ జరుగుతోంది. జగన్‌కు అనుకూలంగా కేసీఆర్‌ వ్యవహరించడంపైనా కమ్మ సామాజిక వర్గం గుర్రుగా ఉందని విశ్లేషకుల అంచనా.

Advertisement

రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌ అయ్యాక తెలంగాణలో టీడీపీ ఓట్‌ బ్యాంక్ కాంగ్రెస్‌ వైపు టర్న్ అయింది. దాంతో…
రేవంత్‌ అనుకూల ఓటు బ్యాంక్‌కు గండికొట్టేలా బీజేపీ వ్యూహాలు పన్నుతున్నట్లు భావిస్తున్నారు. తెలంగాణలో పవన్‌తో కలిసి పోటీ చేస్తే చంద్రబాబు సామాజిక వర్గం ఓట్లు కూటమికే పడతాయనే ఆలోచనతోనే జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఆసక్తి చూపిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీ నగర్ లాంటి స్థానాలను జనసేనకు కేటాయిస్తే.. చంద్రబాబు సామాజికవర్గం ఓట్లు కాంగ్రెస్‌కు దూరమవుతాయని బీజేపీ అంచనా వేస్తోందని అంటున్నారు. ఒకవేళ తాము గెలవకపోయినా కాంగ్రెస్‌ ఓడిపోతే చాలన్నట్లు కమలనాథుల రాజకీయం ఉందనే చర్చ జరుగుతోంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×