Big Stories

BJP Strong Counter : బీజేపీ చేతిలో డ్రగ్స్ అస్త్రం.. కేటీఆర్ అండ్ టీమ్ కు పరోక్ష వార్నింగ్?

BJP Strong Counter : ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై కర్నాటకలో డ్రగ్స్ కేసు ఉందంటూ బీజేపీ తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ప్రస్తావించడం సంచలనంగా మారింది. కేటీఆర్ తో సహా 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రగ్స్ కి బానిసలయ్యారని, అందుకే డ్రగ్స్ కేసు కనుమరుగు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సైతం డ్రగ్స్ గురించి మాట్లాడారు. ఆ 16 మంది నేతల లిస్ట్ తమ దగ్గర ఉందంటూ చెప్పుకొచ్చారు. వారిద్దరి మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

- Advertisement -

ఓవైపు మునుగోడు ఉప ఎన్నిక, మొయినాబాద్ ఫాంహౌజ్ ఎపిసోడ్, ఆడియో లీకుల వ్యవహారం హాట్ హాట్ గా సాగుతుంటే.. ఇలాంటి సమయంలో ఎప్పుడో ముగిసిపోయిన డ్రగ్స్ అంశాన్ని మళ్లీ ఫ్రెష్ గా ప్రస్తావించడం అనుమానాలకు కారణమవుతోంది. కావాలనే బండి సంజయ్ డ్రగ్స్ టాపిక్ మాట్లాడారా? బెదిరించాలనే రోహిత్ రెడ్డిపై కర్నాటకలో డ్రగ్స్ కేసు ఉందని తరుణ్ చుగ్ గుర్తు చేశారా? అనే చర్చ మొదలైంది.

- Advertisement -

కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఏదైనా తేడావస్తే.. అక్కడ రివేంజ్ తీసుకుంటామనేలా తరుణ్ చుగ్ రోహిత్ రెడ్డికి పరోక్ష వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. బండి సంజయ్ సైతం ఫాంహౌజ్ ఇష్యూను సైడ్ ట్రాక్ చేయడానికే డ్రగ్స్ మేటర్ తీసుకొచ్చారని చెబుతున్నారు. కేటీఆర్-డ్రగ్స్ గురించి ఎలాంటి ప్రస్తావన చేయవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా.. బండి సంజయ్ మళ్లీ అదే పాత ప్రస్తావన చేయడం.. అదికూడా ఇలాంటి కీలక సమయంలో ఆ టాపిక్ మాట్లాడటం అంతా వ్యూహాత్మకమే అంటున్నారు. పైలెట్ ను కంట్రోల్ చేసేందుకు.. కేటీఆర్ ను డిఫెన్స్ లో పడేసేందుకే.. వారిద్దరు ఇలా మాట్లాడారని భావిస్తున్నారు.

ఇక, అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీనరసింహుడిని తాకినందుకు ఆలయంలో సంప్రోక్షణ చేయాలని కేటీఆర్ అంటే.. ముందు కేసీఆర్, కేటీఆర్ నోళ్లను సంప్రోక్షణ చేయాలంటూ బండి కౌంటర్ ఇచ్చారు. త్వరలోనే కేసీఆర్ పాలన నుంచి విముక్తి కలిగించి.. తెలంగాణను పూర్తిగా సంప్రోక్షణ చేస్తామంటూ సవాల్ చేశారు బండి సంజయ్. మునుగోడు ఉప ఎన్నిక జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందంటూ తెలంగాణ మే సవాల్ అన్నారు తరుణ్ చుగ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News