నియోజవర్గాల పునర్విభజనపై రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా విమర్శలు కొనసాగుతున్నాయి.కేంద్రంలోని బీజేపీ దక్షిణాది రాష్ట్రాల గురించి పట్టించుకోకుండా ఆగమేఘాల మీద డీలిమిటేషన్ బిల్లును తీసుకువచ్చేందుకు సిద్ధమైందని సీఎం రేవంత్ విమర్శలు చేస్తున్నారు.ఈ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ తరఫున ప్రయత్నిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల మద్దతు తీసుకుంటామని చెప్పారు. కాగా, సీఎం కామెంట్స్‌పై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రం ఎదురుదాడికి దిగుతున్నారు. రేవంత్‌కు ఆర్ ఆర్ టాక్స్ వసూలు చేయడం, ఢిల్లీ కాంగ్రెస్‌కు మూటలు మోయడం మినహా ఏమీ తెలియదని మండిపడుతున్నారు.
కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నదని, జనాభాతో సంబంధం లేకుండా 50 శాతం మేర అన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూస్తామని కూడా ప్రకటించారు. అయినప్పటికీ 50 శాతం పెంపు అనేది కేవలం ఉత్తారాదికి మేలు చేస్తుందని.. దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో 100 అసెంబ్లీ 20 పార్లమెంటు సీట్లు ఉంటే.. అందులో 50 శాతం అనగా.. అసెంబ్లీలో 100+50= 150, పార్లమెంటులో 20+10 = 30 సీట్లు మాత్రమే పెరుగుతాయి. అదే యూపీ విషయానికొస్తే అక్కడ 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అందులో 50 శాతం అనగా.. మొత్తం 120 ఎంపీ సీట్లు పెరగనున్నాయి. దక్షిణాదితో పోలిస్తే ఉత్తారాధిలోనే పార్లమెంట్ స్థానాలు అధికంగా ఉన్నాయని సీఎం రేవంత్ గుర్తుచేశారు. దీనిపై బీజేపీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఢిల్లీ హైకమాండ్ ఎలా చెబితే రేవంత్ అలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.
తెలంగాణలో 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్‌లో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 60 వరకు అసెంబ్లీ, 8 మేర ఎంపీ సీట్లు పెరగనున్నాయి. ఇందులో మహిళా రిజర్వేషన్ల అమలుచేయగా.. 33 శాతం సీట్లు మహిళలకు వెళ్లనున్నాయి. దీనికి తోడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పోనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో సీట్లు పెరిగినా ఉత్తారాదితో పోలిస్తే చాలా తక్కువ అని సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు. ఉత్తరాదిలో పెరిగే సీట్లతో పోలిస్తే దక్షిణాదిలో చాలా తక్కువ సీట్లు పెరుగుతాయని సీఎం వెల్లడించారు. ఈ మేరకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దక్షిణాది అసవరం లేకపోతే తెలంగాణలోని బీజేపీ నేతలతో ప్రధాని మోడీ, అమిత్ షాకు అవసరం కూడా ఉండదని పేర్కొన్నారు.అప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ పెద్దల ఇండ్ల వద్ద చెప్రాసి పనులు కూడా దొరకవని ఎద్దేవా చేశారు.
బీఆరెఎస్‌కు ఒక్కసారిగా చంద్రబాబు ఆదర్శమెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేతమా?
రేవంత్ వ్యాఖ్యల ప్రకారం.. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిన భారీ సీట్లు పెరిగి.. దక్షిణాదిన తక్కువ సీట్లు పెరిగితే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ..కేవలం ఉత్తరాదిపైనే ఫోకస్ పెడుతుంది.మెజార్టీ స్థానాలు ఎక్కడైతే ఉంటాయో ఆ రాష్ట్రాలపైనే కేంద్రం పెద్దల ఫోకస్ ఉంటుంది. దక్షిణాదిపైనే వారుపెద్దగా ఫోకస్ పెట్టకపోవచ్చని, అప్పుడు సౌత్ స్టేట్స్ కేవలం టాక్సులు కట్టడానికి మాత్రమే ఉంటాయని గుర్తుచేశారు.ఇప్పటికే సౌత్ స్టేట్స్ 40 శాతం పన్నులు కడితే కేంద్రం నుంచి రివర్స్‌లో రూ.2 రూపాయలు కూడా రావడం లేదని సీఎం రేవంత్ ఇప్పటికే నొక్కిచెప్పారు. మరి దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారు? వారి భవిష్యత్‌ను వాళ్లే చేతులారా? నాశనం చేసుకుంటున్నారా? అని చర్చ జరుగుతున్నది.