BigTV English

Blind Fold Dating: బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్.. హైదరాబాద్‌లో బయటపడ్డ గలీజ్ దందా..

Blind Fold Dating: బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్.. హైదరాబాద్‌లో బయటపడ్డ గలీజ్ దందా..

BigTv Sting Operation On Blind Fold DatingBigTv Sting Operation On Blind Fold Dating: భాగ్యనగరంలో బ్లైండ్ ఫోల్డ్‌ డేటింగ్ పేరుతో గలీజ్‌ దందా చేస్తున్న నిర్వాహకుల బెండు తీసింది బిగ్‌ టీవీ. వరుసగా కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఈ కేసులో ముగ్గురు నిర్వాహకులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


ముఖ పరిచయం లేని వారిని ఓచోటకు తీసుకొచ్చి డేటింగ్ రిలేషన్ లోకి వెళ్లేలా చేస్తున్న బ్లైండ్ ఫోల్డ్ డేటింగ్ బాగోతాన్ని కళ్లకు కట్టినట్టు చూపింది. బిగ్‌ టీవీ నిర్వహించిన ఈ స్టింగ్‌ ఆపరేషన్‌లో వరుస కథనాలు నడిపింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. హిమాయత్ నగర్‌లోని అమ్యూజియం కేఫ్‌లో తనిఖీలు నిర్వహించి ఈ దందా సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు.

థ్రిఫ్టీ సోషల్.. ఇన్ స్టా గ్రామ్ లో థ్రిఫ్టీ సోషల్ అనే పేరుతో పేజ్ క్రియేట్ చేసింది. అందులో యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి వీకెండ్ తెలియని వ్యక్తులను కలుసుకోండి.. రియల్ లైఫ్ లో కనెక్షన్స్ పెంచుకోండి.. అంటూ ప్రచారం చేస్తున్నారు. థ్రిఫ్టీ సోషల్ ఆదివారం హైదరాబాద్, బెంగళూర్, ముంబై, పూణె, కోల్ కత్తా, ఢిల్లీ లో థ్రిఫ్టీ ఎక్స్ బ్లైండ్ ఫోల్డ్స్ ఈవెంట్ ని నిర్వహించింది. ఇందుకోసం వారం, 10 రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. ఆన్‌లైన్ లో టికెట్స్ అందుబాటులో ఉంచింది.


ప్రోగ్రాం నిర్వహించే ముందు రోజు వరకు ప్లేస్ ఎక్కడా.. అనేది రివీల్ చేయకుండా ప్రోగ్రాం జరిగే రోజు ఉదయం వెన్యూ ప్లేస్ డీటెయిల్స్ వాట్సాప్ మెసేజ్‌లు పంపించింది. ఈ ప్రోగ్రాంకు వెళ్లాలనుకునేవారికి ఆన్లైన్ లో 499 రూపాయలు నుంచి టికెట్ ప్రైజ్‌లను పెట్టారు. ఫీమెల్, ఎర్లీ బర్డ్ ఫీమెల్, మేల్, ఎర్లీ బర్డ్ మేల్ ఇలా కేటగిరి వైజ్ గా టికెట్ లను అందుబాటులో ఉంచారు. టికెట్ బుక్ చేసుకునే ముందు డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, పిన్ కోడ్, స్టేట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న మరుసటి రోజు ఈవెంట్ డీటెయిల్స్ తో వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు.

హిమాయత్ నగర్ లో గల అమ్యూజియమ్ కెఫేలో ఈ థ్రిఫ్టీ ఎక్స్ బ్లైండ్ ఫోల్డ్స్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈవెంట్ కి వెళ్లాక ఒక పేపర్ మీద డీటెయిల్స్ తీసుకుని సంతకం చేయించుకుంటారు. ఆ తర్వాత రెడ్ క్లాత్ ని కళ్లకు కడతారు. కాసేపటికి వాలంటీర్లు తీసుకెళ్లి అమ్మాయిలను, అబ్బాయిలను ఎదురెదురుగా కూర్చోబెడతారు. ఒకరినొకరికి పరిచయం చేసి మాట్లాడుకోమంటారు. ఒక్కొక్కరిని నలుగురైదుగురితో మాట్లాడిస్తారు.

గంటపాటు బ్లైండ్ ఫోల్డ్ కాన్వర్జేషన్ అయ్యాక ఫోల్డ్స్ తీపించి అందరిని ఒక చోట కూర్చోబెడతారు. ఆ తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలతో కలిసి ఫన్, ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఆడిస్తారు. ఇలా వాళ్ల మధ్య పార్టనర్ షిప్ పెరిగి బాండింగ్‌ బిల్డ్ అయ్యేలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా ప్రతి వీకెండ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చ్ 17న కూడా ఈ ఈవెంట్ లు చేసేందుకు ఇప్పటి నుంచే బుకింగ్స్ మొదలు పెట్టేశారు. అయితే ఎలాంటి లీగల్ పర్మిషన్ లేకుండా చేస్తున్నారు.

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×