Four ADULT STARS Died in this Year: అడల్ట్ సినీ పరిశ్రమను రోజు రోజుకూ విషాదాలు వెంటాడుతున్నాయి. అయితే అవి సాధారణ మరణాలు కాకుండా.. ఆత్మహత్యలు కావడం అందరినీ ఆశ్చర్చానికి గురిచేస్తోంది. ఇప్పటికి కేవలం రెండు నెలల్లో నలుగురు పోర్న్ స్టార్లు మరణించడం హాలీవుడ్ అడల్ట్ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
మొదటగా తైనా ఫీల్డ్స్ – జనవరి 6, ఆ తర్వాత జెస్సీ జేన్ – జనవరి 24న , ఆపై కాగ్నీ లిన్ కార్టర్ – ఫిబ్రవరి 15న మరణించగా.. తాజాగా సోఫియా లియోన్ – మార్చి 1న మృతి చెందింది. అయితే ఆమె మరణించిన విషయం మార్చి 9న వెలుగులోకి వచ్చింది.
కాగా మరణించిన ఈ పోర్న్ స్టార్స్ అంతా అడల్ట్ సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నవారే కావడం విశేషం. ఇంతటి స్టార్ స్టేటస్ కలిగిన ఈ నటీమణులు ఆత్మహత్యలు చేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. అంతేకాకుండా వీరి వయస్సు కూడా 30 ఏళ్లలోపు మాత్రమే.
Also Read: అవార్డులు కొల్లగొడుతున్న ఓపెన్‌హైమర్.. విజేతల లిస్ట్ ఇదే..
కాగా ఈ స్టార్స్ ఇప్పుడిప్పుడే ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి సినిమాలు, టీవీ షోలలో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అడల్ట్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చాక ఇలాంటి సమయంలో అనుమానాస్పద మరణాలు జరగడం హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
మొదటిసారి మరణించిన తైనా ఫీల్డ్స్ వయస్సు 25 ఏళ్లు. తైనా ఫీల్డ్స్ తన ఇంట్లో జనవరి 6న అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే ఆమె మరణించకముందు అంటే రెండు నెలల క్రితం తేనా.. అక్కడ అడల్ట్ ఇండస్ట్రీలో జరుగుతున్న అరాచకాలపై ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఆ తర్వాతనే ఈ ఘటన జరగడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఆమె మరణం వివాదాస్పదంగా మారింది. అదేవిధంగా జెస్సీ జేన్ అనే మరో పోర్న్ స్టార్ కూడా జనవరి 24న తన నివాసంలో చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఆమె డ్రగ్స్ ఓవర్ డోస్ కావడం వల్లనే చనిపోయినట్లు నిర్ధారించారు.
Also Read: ఈ రోజు టీవీల్లో అన్నీ యాక్షన్ సినిమాలే.. ఇదిగో లిస్ట్
ఆమెతో పాటు మరో నటి కాగ్నీ లిన్ కార్టర్ ఫిబ్రవరి 15న మృతి చెందింది. ఈ నటి వయస్సు 36 ఏళ్లు. ఆమె తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే అందుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. కాగా ఈ నటి అడల్ట్ సినిమాలకు గుడ్ బై చెప్పిన అనంతరం సొంతంగా ఫిట్‌నెస్ స్టూడియో పెట్టుకుంది.
అయితే అలా పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం కొత్త చర్చలకు దారి తీసింది. ఇలా జనవరిలో ఇద్దరు, ఫిబ్రవరిలో ఒకరు, కాగా.. తాజాగా సోఫియా లియోన్ కూడా తన 26 ఏళ్ల వయస్సులో ఆత్మహత్య చేసుకోవడం మరింత చర్చలకు దారితీసింది.
ఇలా అతి కొద్ది గ్యాప్‌లోనే నలుగురు పోర్న్ స్టార్‌లు చనిపోవడం అందరినీ ఆలోజింపచేస్తోంది. అంతేకాకుండా వారు అడల్ట్ ఇండస్ట్రీని వదిలి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరగడం సర్వత్రా అక్కడ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. అసలు ఆ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనే ప్రశ్నలు అందరి మెదల్లోను మెదులుతున్నాయి.