BigTV English

Bodhan Ex MLA Shakeel : ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు.. పోలీసులు పాత్రపై అనుమానం

Bodhan Ex MLA Shakeel : ప్రజా భవన్ వద్ద జరిగిన యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో అసలు నిందితుడు అయిన సోహైల్‌ను కాపాడేందుకు పోలీసులు సహకరించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. యాక్సిడెంట్ తర్వాత ప్రమాదం‌కి కారణం అయినా సోహైల్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. అనంతరం సోహైల్‌ను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Bodhan Ex MLA Shakeel : ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు.. పోలీసులు పాత్రపై అనుమానం

Bodhan Ex MLA Shakeel : ప్రజా భవన్ వద్ద జరిగిన యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో అసలు నిందితుడు అయిన సోహైల్‌ను కాపాడేందుకు పోలీసులు సహకరించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. యాక్సిడెంట్ తర్వాత ప్రమాదం‌కి కారణం అయినా సోహైల్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. అనంతరం సోహైల్‌ను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అనంతరం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సోహైల్‌ను విడిపించుకుని వెళ్ళిపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి. సోహైల్‌కు బదులుగా మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో పనిమనిషి అబ్దుల్ అసిఫ్‌ను కేసులో పోలీసులు చేర్చారు. అయితే ప్రమాద సమయంలో కారుని అబ్దుల్ నడిపినట్లు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు.



ఈ కేసు విచారణ చేస్తున్న పంజాగుట్ట సీఐ దుర్గారావు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ కేసులో సీఐ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో డ్యూటీ లో ఉన్న ఎస్సై , ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. సోహైల్ స్నేహితులను కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రికార్డు అయిన సీసీటీవి దృశ్యాలను పరిశలిస్తున్నారు.

ప్రమాదంలో కీలక నిందితుడు అయిన సోహైల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై హైదారాబాద్ సీపీ విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన తర్వాత సోహైల్‌కు సహాయం చేసిన పోలీసులు ఏవరు అని విచారణ చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ప్రమేయంపై అన్ని విధాల దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నారు ? పోలీసులు నిందితులకు ఎందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయ్యలేదు ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సోహైల్‌ను విడిపించుకుని తీసుకువెళ్ళడంలో తన తండ్రి అయినా బోధన్ మాజీ మంత్రి షకీల్ కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×