BigTV English

Minister Roja : రోజాకు ఈ సారి టికెట్ కష్టమే .. రాజకీయ వర్గాల్లో చర్చ..

Roja : మంత్రి రోజాకు ఈ సారి మొండి చెయ్యేనా..? ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా జరుగుతున్న చర్చ అదే. ఏపీ కేబినెట్‌లోని మంత్రుల్లో ఎవరూ మోయనంతగా సీఎం జగన్‌ను ఆమె మోస్తున్నా.. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి నిత్యం ఏదో ఓ కార్యక్రమం చేస్తున్నా.. ఆమెకు మాత్రం ఈ సారి టికెట్ డౌటే అన్న వాదనే వినిపిస్తోంది. ఇంతకీ రోజాకు వచ్చిన చిక్కేంటి..?

Minister Roja :  రోజాకు ఈ సారి టికెట్ కష్టమే .. రాజకీయ వర్గాల్లో చర్చ..

Minister Roja : మంత్రి రోజాకు ఈ సారి మొండి చెయ్యేనా..? ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా జరుగుతున్న చర్చ అదే. ఏపీ కేబినెట్‌లోని మంత్రుల్లో ఎవరూ మోయనంతగా సీఎం జగన్‌ను ఆమె మోస్తున్నా.. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి నిత్యం ఏదో ఓ కార్యక్రమం చేస్తున్నా.. ఆమెకు మాత్రం ఈ సారి టికెట్ డౌటే అన్న వాదనే వినిపిస్తోంది. ఇంతకీ రోజాకు వచ్చిన చిక్కేంటి..?


మంత్రి రోజా గురించి తెలియని వాళ్లుండరు. తన శాఖలో ఏం జరుగుతుందన్న దాని కన్నా.. జగన్‌ను ఎలా ప్రసన్నం చేసుకోవాలన్న దానిపైనే రోజా ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్ చేస్తారన్న టాక్‌ గట్టిగానే వినిపిస్తుంటుంది. స్వామి భక్తిని ప్రదర్శించడంలో రోజాను మించిన వాళ్లు లేరంటారు వైసీపీ నేతలు. జగన్ పుట్టినరోజు వేడుకలను టూరిజం, క్రీడాశాఖ మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని కూడా అందులో భాగంగానే ఏర్పాటు చేశారన్న వాదనా ఉంది.

ప్రతీ వారం తిరుమల వెళ్లి వెంకన్నను దర్సించుకునే రోజా.. జగన్‌ను మెప్పించడం కోసమే క్రిస్‌మస్‌కు శాంతాక్లాజ్ డ్రస్సు వేసుకుని మరీ గిఫ్ట్‌లు పంచారన్న టాక్‌ పార్టీలోనూ వినిపిస్తోంది. స్కూటర్ ర్యాలీలు.. అన్నదాన కార్యక్రమాలు దీనికి అదనం.. ఫ్లెక్సీలు.. హోర్డింగ్‌లు ఒక్కటేమిటి.. జగన్‌ను మెప్పించడానికి అవకాశం ఉన్న ఏ మార్గాన్ని వదులుకోలేదు.


ఎవరెన్ని మాటలు అన్నా.. ఎన్ని విమర్శలు వచ్చినా సీఎం జగన్‌ను పొగిడే విషయంలో రోజా ఏ రోజూ వెనక్కి తగ్గలేదు. పైగా జగన్ ప్రత్యర్థులు చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ ను తిట్టే విషయంలో మంత్రులందరికన్నా ఓ అడుగు ముందే ఉన్నారు. ఇంత చేసినా రోజాకు మాత్రం ఈ సారి టికెట్ డౌటే అంటున్నారు. జగన్ చేయిస్తున్న సర్వేల్లో ఆమెపై నెగిటివ్ ఫీడ్‌ బ్యాక్‌ రావడంతో నగరిలో కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారట జగన్. ఈ విషయమే రోజాలో టెన్షన్ పెంచేస్తోంది.

మొత్తంమీద సర్వేల ఎఫెక్ట్ రోజాపై గట్టిగానే పడుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్ని పూజలు, వత్రాలు చేసిన ఫలితం దక్కలేదన్నట్లు.. సీఎం జగన్‌ను అంత మోసినా చివరకు టికెట్ దక్కకడం డౌటే అన్నట్లు ప్రస్తుతం సీన్ కనిపిస్తోంది. రోజా మాత్రం, ఏదో రకంగా జగనే న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే ఉన్నానంటున్నారు. చూద్దాం.. రోజా ఆశలు నెరవేరతాయో లేదో..

Related News

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Big Stories

×