Secunderabad: సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నుంచి తప్పిపోయిన ఆరేళ్ల చిన్నారి కథ విషాదంగా ముగిసింది. ఆ చిన్నారిని గతరాత్రి ఓ సెక్యూరిటీ గార్డు హత్య చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అసలు ఏం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లాలోని బొల్లారంలోని కౌకూర్ విల్లా ఆర్కిడ్‌లో ఓ ఫ్యామిలీ ఉంటోంది. ఈ దంపతులకు ఆరేళ్ల చిన్నారి అరేలియా మౌజెస్ ఉండేది. ఆ చిన్నారి సందడితో ఆ ఇల్లంతా కలకలలాడేది. శనివారం సాయంత్రం ఆ చిన్నారి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని సెల్లార్‌లో ఆడుతూ ఉండేది. రాత్రి సుమారు 9 గంటలకు సడన్‌గా కనిపించకుండా పోయింది. చిన్నారి కోసం వెతికిన కుటుంబసభ్యులు, ఇక ఫలితం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన 10 ప్రత్యేక పోలీసులు బృందాలు, ఆ చిన్నారి ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. చివరకు ఆ చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని క్లబ్ హౌస్ నేలమాళిగలో పడేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు విక్రమ్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితుడు ఆ చిన్నారి తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. పాపను చంపేసిన నిందితుడు.. ఆమె తండ్రి మిల్టన్ ఫెర్నాండేజ్‌కు ఫోన్ చేసి, తాను పాపను విడిచి పెట్టాలంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
నిందితుడు చిన్నారి కాళ్లు, చేతులకు బండరాయి కట్టేసి సెల్లార్‌లోని వాటర్ సంప్‌లో పడేసి చంపేశాడు. తాము ఎంత బతిమిలాడినా వినకుండా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సొంపు నుంచి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ చిన్నారి చివరిగా సెక్యూరిటీ గార్డుతో కనిపించింది. నిందితుడు గడిచిన రెండురోజులుగా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో తిరగడం మొదలుపెట్టాడు.
ALSO READ: మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. మూగ, చెవిటి చిన్నారికి పునర్జన్మ!
నిందితుడి కోసం గాలింపును ముమ్మరం చేసి పోలీసులు, అతడి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సికింద్రాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. పాపను అత్యంత కఠినంగా పొట్టన బెట్టుకున్న సెక్యూరిటీ గార్డ్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
బొల్లారంలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి హత్య
బొల్లారం కౌకూర్ విల్లా ఆర్కిడ్‌లో అదృశ్యమైన అరేలియా ఫెర్నాండేజ్(5) హత్యకు గురైంది. విల్లా సెక్యూరిటీ గార్డ్ విక్రమ్ పాపను హతమార్చి క్లబ్‌హౌస్ సెల్లార్ సంపులో పడవేశాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.#Secunderabad… https://t.co/nwKmnWH10j pic.twitter.com/D4zkHGuCTH
— BIG TV Breaking News (@bigtvtelugu) October 11, 2026