E-Paper
Advertisement

ప్రభుత్వ హెల్త్ కార్డ్ పథకంపై వివాదం.. సర్కార్‌కు తప్పని తిప్పలు!

ప్రభుత్వ హెల్త్ కార్డ్ పథకంపై వివాదం.. సర్కార్‌కు తప్పని తిప్పలు!
Advertisement

Health Cards: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆయా కుటుంబాలకు అత్యంత కీలకమైన ఆరోగ్య భద్రతా పథకం (హెల్త్ కార్డ్) అమలు ప్రస్తుతం వివాదాస్పదం అయింది. వైద్య సేవల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకంలో, నెలవారీ ప్రీమియం కటింగ్ విధానంపై ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వానికి మధ్య తీవ్రమైన గ్యాప్ తలెత్తాయి. అందరికీ ఒకే రకమైన ప్రీమియం విధానం ఉండాలనే నిబంధనపై భిన్నాభిప్రాయాలువ్యక్తమవుతుండటంతో, ఈ సమస్య సర్కార్‌కు ఒక పెద్ద చిక్కుముడిగా మారింది.

ప్రతి ఉద్యోగి..

ప్రస్తుత నిబంధనల ప్రకారం హెల్త్ కార్డ్ పథకం కింద ప్రతి ఉద్యోగి నుంచి ఒకే రకమైన ప్రీమియం మొత్తాన్ని వసూల్ చేయడం పై కిందిస్థాయి నుంచి పైస్థాయి క్యాడర్ వరకు అసంతృప్తి వ్యక్తమవుతోంది. క్లాస్-4 ఉద్యోగుల నుంచి మొదలుకొని ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరికీ ఒకే రకమైన ప్రీమియం కటింగ్ చేయడం సరైన పద్ధతి కాదని వివిధ సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి. వేతనాల వ్యత్యాసాన్ని బట్టి ప్రీమియం ఉండాలని, అందరికీ ఒకే తీరు లో తీసుకోవడం తక్కువ వేతనాలు అందుకునే ఉద్యోగులపై ఆర్థిక భారం పడుతోందని సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంఘాల మధ్య విభేదాలు..

Advertisement

ఈ అంశంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మధ్య కూడా ఏకాభిప్రాయం కొరవడింది. కొన్ని సంఘాలు ప్రభుత్వ ప్రతిపాదనకు అనుకూలంగా ఉండగా, మరికొన్ని సంఘాలు మాత్రందీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విభిన్న సంఘాల నుంచి వస్తున్న పరస్పర విరుద్ధమైన డిమాండ్లు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఎవరికి వారు తమ వర్గాల ప్రయోజనాల కోసం పట్టుబడుతుండటంతో, ఈ వివాదం ముదురుతోంది.

Also read: సీజేపీ నిరసన మధ్య.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, మెట్రో-ఇంటర్నెట్ సర్వీసులు పునరుద్ధరించాలని ఆదేశం

షేర్ స్పష్టత ఉండాలి.

Advertisement

ఈ వివాదానికి శాశ్వత పరిష్కారంగా ఉద్యోగ వర్గాల నుంచి ఒక స్పష్టమైన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఉద్యోగుల జీతభత్యాల ఆధారంగా ప్రీమియం చెల్లింపులు ఉండాలని వారు సూచిస్తున్నారు.తక్కువ వేతనం పొందే కింది స్థాయి ఉద్యోగులు తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించేలా, హయ్యర్ క్యాడర్ కి వెళ్లే కొద్దీ ఆ నిష్పత్తి ని పెరిగేలా ఫిక్స్డ్ పద్ధతిని అనుసరించాలని కోరుతున్నారు. ఇది ఆర్థికంగా అందరికీ న్యాయం చేస్తుందని, బేధాభిప్రాయాలకు తావు ఉండదని సంఘాలు స్పష్టంచేస్తున్నాయి.

క్యాడర్ వారీగా వేతనాలు..

ప్రభుత్వంప్రతిష్టాత్కంగాతలపెట్టిన ఈ ఆరోగ్య పథకం ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతం కావాలంటే, అన్ని ఉద్యోగ సంఘాలను విశ్వాసంలోకి తీసుకోవడం అత్యంత ముఖ్యమని వివరిస్తున్నారు. అందరికీ ఒకే ప్రీమియం విధానాన్ని అమలు చేయడం కంటే, ఉద్యోగుల ఆర్థిక స్థోమత, క్యాడర్ వారీగా వేతనాల శ్రేణిని పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నారు.

Also read: బంపర్ ఆఫర్..75 ఇంచుల టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్

Tags

Related News

గద్వాల మున్సిపల్ ఆఫీస్‌లో ఉద్రిక్తత.. కమిషనర్ విధులకు ఆటంకం!

బొల్లారంలో షాకింగ్ ఘటన.. ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన సెక్యూరిటీ, అసలు మేటరేంటి?

మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. మూగ, చెవిటి చిన్నారికి పునర్జన్మ!

కరెంట్ కొందామన్నా దొరకట్లేదు! ఎల్‌నినో ముప్పుపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర హెచ్చరిక!

మహబూబాబాద్‌లో తీవ్ర విషాదం.. బావిలో దూకి తల్లీ, పిల్లలు ఆత్మహత్య!

మల్కారం క్వారీలో విషాదం.. ఈతకోసం వెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!

బతుకమ్మ వేదికగా గులాబీ వ్యూహం.. కవితకు చెక్‌ పెట్టేలా బీఆర్‌ఎస్‌ ప్లాన్!

Big Stories

Advertisement
×