E-Paper
Advertisement

మహబూబాబాద్‌లో తీవ్ర విషాదం.. బావిలో దూకి తల్లీ, పిల్లలు ఆత్మహత్య!

మహబూబాబాద్‌లో తీవ్ర విషాదం.. బావిలో దూకి తల్లీ, పిల్లలు ఆత్మహత్య!
Advertisement

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడటంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

వివరాల్లోకి వెళ్తే..

Advertisement

లింగ్యా తండా-B గ్రామ పంచాయతీ పరిధిలోని సామ్యకుంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల మనస్తాపానికి గురైన తల్లి బానోత్ అనూష, తన కుమారుడు నిశాల్ కృష్ణ, కూతురు వర్షిణితో కలిసి సమీపంలోని బావిలో దూకేసింది. నీటిలో మునిగిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

శోకసంద్రంలో గ్రామం

Advertisement

ఒకే ఇంట్లో తల్లితో పాటు ఇద్దరు చిన్న పిల్లలు కూడా మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకు గల అసలు కారణాలేంటనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

Also Read: రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం సీరియస్!

Tags

Related News

మల్కారం క్వారీలో విషాదం.. ఈతకోసం వెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!

బతుకమ్మ వేదికగా గులాబీ వ్యూహం.. కవితకు చెక్‌ పెట్టేలా బీఆర్‌ఎస్‌ ప్లాన్!

చింతల్‌లో విషాదం.. జువెలరీ షాపులో రసాయనం మింగి రెండేళ్ల చిన్నారి మృతి

కాంగ్రెస్‌ది ‘జెన్ జీ’ థింకింగ్.. ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం.. వంద కోట్ల బినామీ ఆస్తులు గుట్టురట్టు!

వరదలు లేని హైదరాబాద్ సాధ్యమేనా? హైడ్రా ఏమంటోందంటే..?

హైదరాబాద్‌లో పీఆర్టీ వ్యవస్థ.. భవిష్యత్ రవాణాకు సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

Big Stories

Advertisement
×