Bomb Threat: హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌కు ఆగంతకులు మెయిల్ పంపడంతో SPF, CISF బలగాలు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్ట్ ఉద్యోగులు, సిబ్బందిని బయటికి పంపి తనిఖీలు కొనసాగిస్తున్నారు.
కాగా ఇటీవల దేశంలోని పలు విమానాశ్రయాల్లో.. బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా బుధవారం ఉదయం నగరంలోని రాజీవ్ గాంధీ.. అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. “విమానాశ్రయంలో బాంబు పెట్టాం, అరగంటలో పేలుతుంది” అంటూ.. ఆగంతకులు ఫోన్ కాల్‌తో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రయాణికులను బయటకు తరలించి, విమానాశ్రయ ప్రాంగణాన్ని ఖాళీ చేశారు.
సందేశం వచ్చిన వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సీసీటీవీ అథ్యయనం బృందాలు రంగంలోకి దిగాయి. పలు గంటల పాటు తనిఖీలు జరిపారు. చివరికి ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. భద్రతా యంత్రాంగం దీన్ని ఫేక్ మెయిల్‌గా ప్రకటించింది.
ఈ అనూహ్య ఘటన వల్ల పలువురు ప్రయాణికులు.. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ఫ్లైట్లు ఆలస్యంగా వెళ్లాయి. బెదిరింపు కాల్ చేసిన నెంబర్‌ను ట్రేస్ చేసే పనిలో సైబర్ క్రైం పోలీస్‌లు నిమగ్నమయ్యారు. కాల్ వాయిస్‌ను అనాలిసిస్ చేయిస్తూ, కాల్ వచ్చిన ప్రాంతం, మెయిల్ ని పరిశీలిస్తూ.. వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భద్రతా వ్యవస్థ ఎంత కట్టుదిట్టంగా ఉన్నా.. ఇలాంటి ఘటనలు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎలాంటి అనుమానాస్పద సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఎయిరిండికు చెందిన బోయింగ్ విమానం AI 180లో సాంకేతిక సమస్య తలెత్తింది. మొత్తం 228 మంది ప్రయాణుకులు, ఫ్లైట్ సిబ్బందితో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై వెళ్తోంది ప్లైట్. ఈ విమానం కోల్‌కతా చేరిన సమయంలో తనిఖీలు చేపట్టగా ఎడమ ఇంజిన్‌లో టెక్నికల్ ప్లాబ్లం బయటపడింది. దీంతో వెంటనే పైలెట్లు అప్రమత్తమై ప్రయాణికులన్ని దించేశారు.
Also Read: ట్రయాంగిల్ వాటర్ వార్..? బనకచర్ల వివాదం ఏంటంటే..! తెలంగాణ వాటా ఎంతంటే..?
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా ఫ్లైట్ AI 159లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్‌కు ముందే సమస్య గుర్తించడంతో సర్వీసును రద్దు చేశారు. అటు.. ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన AI 143 ఫ్లైట్‌ను రద్దు చేశారు.
మొత్తంగా చూస్తే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియాకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడుతుండడం, వాటి కారణంగా ఫ్లైట్లు రద్దవుతుండడంతో ప్రయాణికులు అమ్మో ఎయిరిండియా అనే పరిస్థితి నెలకొందన్న వాదన విన్పిస్తోంది.