BigTV English

TPCC : బాక్సర్ నిఖత్ జరీన్ కు టీపీసీసీ సన్మానం.. డీఎస్పీ పోస్టు ఇవ్వాలని రేవంత్ డిమాండ్..

TPCC : బాక్సర్ నిఖత్ జరీన్ కు టీపీసీసీ సన్మానం.. డీఎస్పీ పోస్టు ఇవ్వాలని రేవంత్ డిమాండ్..

TPCC : బాక్సింగ్‌ ఛాంపియన్‌, అర్జున్‌ అవార్డు గ్రహీత నిఖత్‌ జరీన్‌ను టీపీసీసీ ఘనంగా సన్మానించింది. హైదరాబాద్‌లోని నిజాం క్లబ్‌లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, అజారుద్దీన్‌, మధుయాష్కీ పాల్గొన్నారు. టీపీసీసీ తరఫున నిఖత్‌ జరీన్‌కు రూ.5 లక్షల బహుమతి అందించారు.


నిజామాబాద్‌ చెందిన నిఖత్ జరీన్ ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొని దేశగౌరవ ప్రతిష్ఠలు పెంచారని రేవంత్‌రెడ్డి అన్నారు. సానియా మీర్జా తర్వాత నిఖత్‌ క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. నిఖత్ జరీన్ స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు. క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్పీగా నిఖత్‌ జరీన్‌కు ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. జనవరి 26లోపు ఆమెకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌లో భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆమెకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని పాఠశాలల విద్యార్థులు వచ్చేలా చూడాలని సూచించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు అందరూ కృషి చేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×