E-Paper
Advertisement

Brahmamudi Serial Today August 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నిజం తెలుసుకున్న రుద్రాణి – షాక్ లో కావ్య  

Brahmamudi Serial Today August 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నిజం తెలుసుకున్న రుద్రాణి – షాక్ లో కావ్య  

Brahmamudi serial today Episode: అప్పు రూంలో బట్టలు సర్దుతుంటే కళ్యాణ్‌ వచ్చి ఇలాంటి పనులు ఏవీ నువ్వు చేయోద్దని అలా చేయడం నాకు ఇష్టం లేదని.. కావాలంటే సింపుల్‌ యోగానో లేకపోతే మెడిటేషనో చేసుకో.. ఇంకా కావాలంటే లైటుగా ఎక్సర్‌సైజులో చేసుకో అని చెప్తాడు. దీంతో అప్పు ఏంటి కూచి కోపం వచ్చిందా.? అలిగావా..? సరేలే ఇంకా నా కడుపులో ఉన్న నీ కూతురుకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. అంతే కాదు కూచి మీ నాన్న నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో కూడా చెప్తాను. అంటూ నవ్వుతుంది. అంత డోర్‌ దగ్గర నుంచి   గమనిస్తున్న కావ్య.. ఎమోషనల్‌ అవుతూ రాజ్‌కు తనకు మధ్య జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటుంది.

ఇంతలో అక్కడికి అపర్ణ, ఇంద్రాదేవి వస్తారు. ఏంటి కావ్య ఏం జరిగింది అని అపర్ణ అడుగుతుంది. దీంతో కావ్య ఏం లేదు అత్తయ్య అని బాధగా వెళ్లిపోతుంది. పాపం పిచ్చిది నా మనవడు ఈ టైంలో తనతో పాటు ఉంటే బాగుంటుంది అని ఆశ పడుతుంది అపర్ణ. తల్లి కాబోయే ఏ ఆడపిల్లైన కోరుకునేది భర్త పక్కన ఉండాలనే కదా అత్తయ్య కోరుకునేది. దాని దురదృష్టమో.. మన అదృష్టమో వాడు ఈ ఇంటికి దాని జీవితానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. వాడు పక్కన లేని లోటు ఎలాగూ తీర్చలేం.. కనీసం దాన్ని సంతోషపెట్టే ప్రయత్నం అయినా చేద్దాం అత్తయ్యా అంటుంది అపర్ణ. అవును అంటుంది ఇంద్రాదేవి.

మరుసటి రోజు ఉదయమే కావ్య కిచెన్‌ లోకి వెళ్లి టీ పెడుతుంటే.. అపర్ణ, ఇంద్రాదేవి వచ్చి కావ్య ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అపర్ణ. నేనేం చేస్తున్నాను కాఫీ పెడుతున్నాను అంతేగా అత్తయ్యా అంటుంది కావ్య. కాఫీ కావాలని మేము నిన్ను అడిగామా అంటుంది అపర్ణ. అదేంటి అత్తయ్యా ఇన్ని రోజులు కాఫీ పెడుతుంది నేనేగా అని కావ్య అడగ్గానే.. ఇన్ని రోజులు వేరు.. ఇప్పుడు వేరు. ఇప్పుడు నువ్వు వట్టి మనిషివి అనుకుంటున్నావా..? కొద్ది రోజుల్లో నువ్వు దుగ్గిరాల ఇంటికి వారసుణ్ని ఇవ్వబోతున్నావు అని చెప్తుంది ఇంద్రాదేవి. ఇంతలో అపర్ణ పనిమనిషి రత్తాలును పిలిచి ఇక నుంచి కిచెన్‌లో నువ్వు తప్ప కావ్య కనబడకూడదు. అలా కనబడితే ఇక నుంచి నువ్వు ఉండవు అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. కావ్య సరే అంటూ వెళ్లిపోతుంది.

తర్వాత ఇంట్లో వాళ్లందరికి రత్తాలు కాఫీ తీసుకొస్తుంది. కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి..? రత్తాలు అని అడుగుతాడు ప్రకాష్‌. ఏం అది తీసుకొస్తే కాఫీ తాగరా ఏంటి..? అని ఇంద్రాదేవి అడుగుతూ వస్తుంది. అలా కాదు ఎప్పుడూ కావ్య కదా తీసుకొచ్చేది అని ప్రకాష్‌ అడుగుతాడు. ఇప్పటి నుంచి కాఫీయే కాదు వంట కూడా చేయదు. వంట నేనే చేస్తాను అంటుంది అపర్ణ. దీంతో ప్రకాష్‌ అయ్యో అంటాడు. ఏం పాతికేళ్లుగా నేనే చేశాను తినలేదా..? అంటుంది. అంతకు ముందు నేను చేశాను కదా అంటుంది ఇంద్రాదేవి. అయితే ఓకే మీ వంట అమృతంతో సమానం అన్నట్టుగా మాట్లాడతాడు. ఇంతలో రుద్రాణి వచ్చి అయినా కావ్యకు ఏమైంది వదిన సడెన్‌గా పనులు మానేసింది అని అడుగుతుంది.

ఫ్లోలో అపర్ణ ఇప్పుడు తను పనులు చేయకూడదు కాబట్టి అనగానే ఇంద్రాదేవి షాక్‌ అవుతుంది. తను ఏమైనా ప్రెగ్నెంటా..? పనుల చేయకుండా ఉండటానికి అని రుద్రాణి అడగ్గానే.. అసలు నీ ఉద్దేశం ఏంటి రుద్రాణి.. కడుపుతో ఉంటేనే పనులు చేయకూడదా..? అని ఇంద్రాదేవి అడుగుతుంది. కాదు చెల్లికి కడుపొస్తే.. అక్కకు రెస్ట్‌ ఇవ్వడం వెనక మీ ఉద్దేశం ఏంటా..? అని అంటుంది రుద్రాణి. ఉద్దేశం లేద పాడు లేదు.. పాపం నా కోడలు ఇన్ని రోజుల కష్ట పడటం చూసి నాకే జాలేసింది. ఇంట్లో ఇంత మంది పనివాళ్లు ఉండగా తను పని చేయడం ఏంటా..? అనిపించింది. అని చెప్తుంది. అందుకే కావ్యకు కిచెన్‌ నుంచి రిటైర్‌మెంట్‌ ఇచ్చాం అంటుంది ఇంద్రాదేవి. దీంతో ఏంటి కిచెన్‌ నుంచి రిటైర్‌మెంట్‌ ఇచ్చారా..? అంటూ విడ్డూరంగా ప్రకాష్‌ అడగ్గానే.. ఏంటి..? అపర్ణ, ఇంద్రాదేవి కోపంగా ప్రకాష్‌ను తిడతారు.

తర్వాత రాహుల్‌ బయట వర్షం పడుతుంటే పరుగున వెళ్లి  స్వప్న బట్టలు తీసుకొస్తుంటే రుద్రాణి వెళ్లి తిడుతుంది. కావ్యను ఎందుకు పని చేయనివ్వడం లేదని అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రాత్రికి కావ్య గదిలోకి వెళ్లి కావ్య వాడుతున్న టాబ్లెట్స్‌ ఏంటో తెలుసుకోవాలని చెప్తుంది. దీంతో రాహుల్‌ సరే అంటాడు.

హాల్లో కూర్చున్న అపర్ణ, ఇంద్రాదేవి దగ్గరకు వెళ్లిన ధాన్యలక్ష్మీ అప్పు చేత వరలక్ష్మీ వ్రతం చేయిద్దామని చెప్తుంది. అయితే ముగ్గురు కోడళ్లతో చేయించాలని అపర్ణ చెప్తుంది. అయితే కావ్యకు పక్కన కూర్చోవడానికి రాజ్‌ లేడు కదా అంటుంది ధాన్యం. ఎలాగైనా సరే రాజ్‌ చేత వ్రతం పూర్తి చేయిద్దాం అనుకుంటారు అపర్ణ, ఇంద్రాదేవి.

మరోవైపు రాత్రికి కావ్య టాబ్లెట్‌ వేసుకుని బయటకు వెళ్లగానే రుద్రాణి, రాహుల్‌ను కావ్య రూంలోకి పంపించి టాబ్లెట్‌ ఫోటో తీసుకురమ్మని చెప్తుంది. రాహుల్‌ వెళ్లి ఫోటో తీసుకుని వస్తాడు. ఆ టాబ్లెట్‌ గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేస్తుంది రుద్రాణి. విషయం తెలిసి షాక్‌ అవుతుంది. ఏంటి మమ్మీ అలా షాక్‌ అయ్యావు అంటాడు రాహుల్‌. దీంతో కావ్య ప్రెగ్నెంట్‌.. అందుకే వాళ్లు అంత కేరింగ్‌గా ఉన్నారు అని చెప్తుంది. వెంటనే ఈ విషయం యామినికి చెప్పాలంటుంది రుద్రాణి.

ఇక అపర్ణతో మాట్లాడాలని స్వరాజ్‌ అన్నం తినకుండా మారాం చేస్తుంటాడు. రేవతి, అపర్ణకు ఫోన్‌ చేసి స్వరాజ్‌తో మాట్లాడిస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రెండు కాళ్లు ఫ్రాక్చర్.. ఆసుపత్రి బెడ్‌పై నుంచి పండు మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

Bramhamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..

Podarillu Lalitha : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Big Stories

×