BigTV English

Kavitha’s bail: ఢిల్లీ లిక్కర్ కేసు.. కవితకు మళ్లీ నిరాశే, ఆగస్టు 20న మరోసారి..

Kavitha’s bail: ఢిల్లీ లిక్కర్ కేసు.. కవితకు మళ్లీ నిరాశే, ఆగస్టు 20న మరోసారి..

Kavitha’s bail: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయా లంటూ ప్రతివాదులుగా ఉన్న ఈడీ, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.


ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత బెయిల్ పిటీషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో వాదాపవాదనలు జరి గాయి. ఆమె బెయిల్‌పై ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే కవిత తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. కేసు మొదలైన నుంచి ఇప్పటివరకు జరిగిన తీరును న్యాయవాదులు వివ రించారు.

ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఇదే క్రమంలో ఈడీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ తదుపరి విచారణను ఆగష్టు 20కి వాయిదా వేసింది.


ALSO READ: బంగ్లా హిందూ దాడులపై రాహుల్ స్పందించరా? బండి సంజయ్

ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈనెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై ఒకటిన తీర్పు ఇచ్చింది. దీన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం అక్కడ కూడా ఆలస్యమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన మరోవారం పాటు కవిత ఆగాల్సిందే. మరి అప్పుడైనా బెయిల్ వస్తుందా? అంటే చెప్పడం కష్టమే.

జైలులో ఉన్న కవితను బయటకు తీసుకొచ్చేందుకు ఆమె కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో హరీష్‌రావు, కేటీఆర్ నాలుగైదు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు. ఆ సమయంలో కవిత బెయిల్‌పై సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి.

ఇదొక కోణం కాగా.. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత బయటపడాలంటే కచ్చితంగా కేంద్రం పెద్దల సహకారం కావాలని భావించిన బీఆర్ఎస్ నేతలు బీజేపీతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలొచ్చాయి. ఆ విషయం ఎంతవరకు పక్కనపెడితే.. ఆగస్టు 20న  కవిత బెయిల్‌పై క్లారిటీ వస్తుందని అంటున్నారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×