BigTV English

KTR Tweet : మంత్రులకు చేపల కూరలు – విద్యార్థులకు పస్తులా?

KTR Tweet : మంత్రులకు చేపల కూరలు – విద్యార్థులకు పస్తులా?

KTR Tweet : రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అనుభవిస్తున్న మంత్రులు పేదలు, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా.. అధికారాన్ని అనుభవించడమే పనిగా పెట్టుకున్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వహకాధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఓ వైపు విషాదం వేధిస్తుంటే.. మంత్రులు వినోదంలో మునిగిపోయారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించలేదనే వివిధ పత్రికల కథనాల్ని పంచుకున్నారు. పండుగ పూట విద్యార్థులను పస్తులు ఉంచారంటూ విమర్శలు గుప్పించారు. ఆ పేపర్ క్లిప్పింగుల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న కేటీఆర్.. ప్రజా పాలన పరాకాష్టకు చేరుకుందంటూ కామెంట్లు చేశారు.


శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో జరిగిన ప్రమాదం గురించి ప్రస్తావించిన కేటీఆర్.. రాష్ట్రం ఓ వైపు విషాదంలో ఉంటే, మంత్రులు మాత్రం ఇవ్వేమి పట్టించుకోకుండా వినోదాల్లో మునిగిపోయారుంటూ విమర్శలు గుప్పించారు. హెలికాఫ్టర్లల్లో చక్కర్లు కొడుతున్న మంత్రులు.. పేదలు, విద్యార్థుల కష్టాలకు పట్టించుకునే ధ్యాసలో లేరంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేప కూరలతో విందులు చేసుకుంటుంటే.. పేద విద్యార్థులు మాత్రం పస్తులుండాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు.

విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్ ప్రజా ప్రభుత్వం ఉందని విమర్శించిన కేటీఆర్.. శివరాత్రి రోజు నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఓ ఘటనను ప్రస్తావించారు. వివిధ తెలుగు పత్రికలు ప్రస్తావించిన ఈ ఘటనలో.. అన్నం వండలేదు గుడిలో తినండి అని విద్యార్థులకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్ సిబ్బంది చెప్పిన విషయాల్ని పంచుకున్నారు. ఇదేంటని ప్రశ్నించారు. పండుగ రోజు హాస్టల్లో ఎందుకు ఆ రోజు వంట చేయలేదని ప్రశ్నించారు.


కొండనాగులలోని ఎస్టీ బాలుర హాస్టల్లో శివరాత్రి పండుగ రోజు మొత్తం 380 మంది విద్యార్థులకు గాను 200 మంది విద్యార్థులు హాస్టళ్లో ఉన్నారని, వారికి అన్నం ఎందుకు వండి పెట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆ రోజు మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి వెళ్ళి తినాలని హాస్టళ్ సిబ్బంది చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. ప్రజా ప్రభుత్వంలో విద్యార్థులకు అన్నం పెట్టలేకుండా ఉన్నారా అని ప్రశ్నించారు.

కనీసం రాత్రి భోజనం కూడా విద్యార్థులకు అందించలేదని ఆగ్రహించిన కేటీఆర్.. రాత్రి భోజనం కోసం వీరం రామాజిపల్లిలోని గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినమని చెప్పడాన్ని తప్పుబట్టారు. విద్యార్థులను అన్నదానానికి పంపించి వంట చేయడం మానేశిన హాస్టల్ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. హాస్టల్ సిబ్బంది తీరుతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ తెలిపారు. భోజనం కోసం అంత దూరం నడిచి వెళ్ళే ఓపిక లేక చాలా మంది విద్యార్థులు పస్తులున్నారని వెల్లడించారు. పండగ పూట విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకుండా, అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తినమని చెప్పడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

Falaknuma train: ట్రైన్‌లో ఉగ్రవాదులు.. ఘట్ కేసర్ స్టేషన్ లో నిలిపివేత, ముమ్మరంగా తనిఖీలు

CM Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. బీసీలకు 42% రిజర్వేషన్

Hyderabad News: బతుకమ్మకుంట ప్రారంభోత్సవం వాయిదా, మళ్లీ ఎప్పుడంటే..

Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాలన్నీ జలమయం

Weather Alert: బలపడిన వాయుగుండం.. మరో మూడు రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. బయటకు రాకండి

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Big Stories

×