BigTV English

Preity Zinta: పొలిటికల్ ఎంట్రీపై ప్రీతి జింటా కామెంట్స్.. టికెట్ ఇస్తామన్నారంటూ..!

Preity Zinta: పొలిటికల్ ఎంట్రీపై ప్రీతి జింటా కామెంట్స్.. టికెట్ ఇస్తామన్నారంటూ..!

Preity Zinta.. సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినిమాలలో స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఎంతో మంది.. రాజకీయ రంగ ప్రవేశం చేసి, అక్కడ కూడా ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు రాజకీయ రంగంలో సక్సెస్ అయిన చాలామంది ఇటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. అందులో కొంతమంది నటులుగా ప్రవేశిస్తే, మరి కొంతమంది నిర్మాతలుగా మారుతున్నారు. ముఖ్యంగా నటీనటులు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం అనేది ఒక టాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు చాలామంది రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో బ్యూటీ కూడా పొలిటికల్ ఎంట్రీ పై కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది


పొలిటికల్ ఎంట్రీ పై ప్రీతి జింటా రియాక్షన్..

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా (Preity Zinta)తాజాగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రస్తావించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈమె.. ఈ విషయంపై మాట్లాడింది. అందులో భాగంగానే ఒక అభిమాని ప్రశ్నిస్తూ..”జవాన్ల కుటుంబంలో పుట్టావు.. కనుక నువ్వు కూడా నా దృష్టిలో ఒక జవాన్ వే.. నీ ప్రతిభకు హాట్సాఫ్ చెబుతున్నాను. రాజకీయాలలో చేరాలనే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా?ఈ విషయం తెలుసుకోవడానికి నాతో పాటు ఎంతోమంది ఆసక్తిగా ఉన్నారు అంటూ అడిగారు”.. దీనికి ప్రీతి జింటా స్పందిస్తూ.. “రాజకీయాల్లోకి వెళ్లడం అనేది ఈ జీవితానికి కుదరదు. ప్రస్తుతం నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు నాకు టికెట్ ఇస్తామని, అలాగే రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేశాయి. కానీ నేను మాత్రం మర్యాదపూర్వకంగా వాటిని తిరస్కరించాను. ఎందుకంటే నాకు రాజకీయరంగంపై ఆసక్తి లేదు. నన్ను సోల్జర్ అని పిలవడం కూడా తప్పుకాదు.. ఎందుకంటే నేను ఒక సైనికుడి కుమార్తెను అలాగే ఒక సైనికుడి సోదరిని కూడా.. మేము ఉత్తర భారతీయులం, దక్షిణ భారతీయులం అని కాదు మనమంతా, మేమంతా భారతీయులం.. దేశభక్తి, జాతీయ గర్వం అనేది మా రక్తంలోనే ఉంది” అంటూ ఆమె తెలిపింది. మొత్తానికి అయితే పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇస్తూ అసలు విషయాన్ని తెలియజేసింది ప్రీతిజింటా.


ప్రీతిజింటా కెరియర్..

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం (ManiRatnam) దర్శకత్వంలో వచ్చిన ‘దిల్ సే’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది ప్రీతిజింటా. ఈ చిత్రంలో షారుక్ ఖాన్(Shahrukh Khan) హీరోగా నటించారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె అటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా ‘ప్రేమంటే ఇదేరా’ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు మహేష్ బాబు(Maheshbabu) హీరోగా వచ్చిన ‘రాజకుమారుడు’ సినిమాలో కూడా నటించింది? ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా నటించిన ప్రీతి జింటా అనంతరం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రీతి జింటాకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×