BigTV English

Laila: ఇప్పటికీ అదే అందం.. వేడి వేడి పేడనే తన సీక్రెట్ అంటున్న లైలా..

Laila: ఇప్పటికీ అదే అందం.. వేడి వేడి పేడనే తన సీక్రెట్ అంటున్న లైలా..

Laila: ఒకప్పుడు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ కోసం సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్స్ అంతా తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తల్లి పాత్ర అయినా సరే అనుకుంటూ చాలామంది సీనియర్ నటీమణులు ఇప్పటికే తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు. అలా ఇటీవల తనకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన తమిళ ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది లైలా. ఒకప్పుడు తమిళంతో పాటు తెలుగులో కూడా హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న లైలా.. ఇప్పటికీ అందం విషయంలో యంగ్ హీరోయిన్స్‌కు పోటీ ఇచ్చేలా ఉంది. తాజాగా తన బ్యూటీ సీక్రెట్ ఇదేనంటూ ఆసక్తికర విషయం బయటపెట్టింది.


గ్రాండ్‌గా రీఎంట్రీ

2006లో ఒక బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకొని పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది లైలా. అప్పటినుండి ఇప్పటివరకు అసలు తను ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో లాంటి విషయాలు కూడా పెద్దగా బయటికి రాలేదు. తన ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా ఎప్పుడూ ప్రైవేట్‌‌గా ఉండడానికే ఇష్టపడేది లైలా. అలాంటిది మూడేళ్ల క్రితం సడెన్‌గా మళ్లీ వెండితెరపై ప్రత్యక్షమయ్యింది. కార్తీ హీరీగా నటించిన ‘సర్దార్’ మూవీలో ఒక కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఒకప్పుడు హీరోయిన్‌గా కనిపించనప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉంది అంటూ తన అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా ఆది పినిశెట్టి హీరోగా నటించిన ‘శబ్దం’లో కూడా మరొక కీలక పాత్రలో అలరించింది లైలా.


పేడ పూసుకుంటాను

ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘శబ్దం’ మూవీలో లైలా (Laila) కీ రోల్ ప్లే చేసింది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్‌లో తను కూడా యాక్టివ్‌గా పాల్గొంటోంది. తాజాగా ‘శబ్దం’ (Sabdham) టీమ్‌ను స్పెషల్‌గా ఇంటర్వ్యూ చేసింది హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. అందులో లైలా అప్పటికీ, ఇప్పటికీ ఏం మారలేదని, అప్పట్లో తను నటించిన ఒక పాటను గుర్తుచేసుకుంది. అంతే కాకుండా ఇప్పటివరకు అసలు లైలాను రీప్లేస్ చేసే హీరోయినే రాలేదని స్టేట్‌మెంట్ ఇచ్చింది. అసలు అప్పటికీ, ఇప్పటికీ ఒకేలా ఉండడం ఎలా సాధ్యమని అడగగా.. తను రోజూ వేడి వేడి పేడను మొహానికి పూసుకుంటానని చెప్పి నవ్వింది లైలా. దీంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు.

Also Read: లీగల్ సమస్యలకు చెక్ పెట్టిన కంగనా.. ఆ సీనియర్ రైటర్‌తో కలిసి ఒప్పందం..

అదే ప్రశ్న

అందం విషయంలో లైలాలో ఇప్పటికీ ఎలాంటి మార్పులు లేకపోవడంతో తను ఎక్కడికి వెళ్లినా తన బ్యూటీ సీక్రెట్ గురించే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అందుకే తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పేడ మొహానికి రాసుకోవడమే తన బ్యూటీ సీక్రెట్ అని చెప్పి అందరి నోళ్లు మూయించింది లైలా. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత తనను స్క్రీన్‌పై చూడడం సంతోషంగా ఉందని తన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక ఆది హీరోగా నటించిన ‘శబ్దం’ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలయ్యి పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఇందులో లైలా మాత్రమే కాదు.. మరొక సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కూడా మరొక కీలక పాత్రలో నటించి అలరించింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×