BigTV English

BRS Reactions: కవితపై ఇంత కక్ష ఉందా? ఒక్కొక్కరే బయటకొస్తున్న బీఆర్ఎస్ నేతలు

BRS Reactions: కవితపై ఇంత కక్ష ఉందా? ఒక్కొక్కరే బయటకొస్తున్న బీఆర్ఎస్ నేతలు
Advertisement

సస్పెన్షన్ వేటు పడే వరకు అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఒక్కసారి కేసీఆర్ నిర్ణయం ఏంటో తెలిశాక అందరూ బయటకొచ్చారు. గతంలో ఎప్పుడూ కవిత ప్రస్తావనే చేయని నేతలు కూడా ఇప్పుడు ఎవరో ఉసిగొల్పినట్టు, ఏదో కక్ష ఉన్నట్టుగా ఆమెపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కవిత కాంగ్రెస్ చేతిలో పావు అనే పాయింట్ ని కామన్ గా వాడేస్తూ ఓ రేంజ్ లో ఆరోపణలు సంధిస్తున్నారు. ఎవరి కళ్ళల్లోనో ఆనందం కోసమో కవిత ఇలా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే మాధవం కృష్ణారావు. బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలనే ఉద్దేశంతో, పార్టీ లైన్ ను దాటే ఎవరికైనా ఇదే గతి పడుతుందని దుయ్యబట్టారు.


మహిళలతో తిట్ల పురాణం..
కవితపై మహిళా నేతలతో కూడా బీఆర్ఎస్ విమర్శలు చేయిస్తోంది. కవిత సస్పెన్షన్ నిర్ణయాన్ని ప్రతి కార్యకర్తా హర్షిస్తున్నారంటున్నారు మాజీ ఎంపీ మాలోత్ కవిత. అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడిన తీరు బీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహం తెచ్చిందని అంటున్న ఆమె, ఆ ఉత్సాహాన్ని నీరు గార్చేందుకు కవితతో కొందరు పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయించారని చెప్పుకొచ్చారు. కవిత వ్యాఖ్యలు పార్టీకి ద్రోహం చేసే విధంగా ఉన్నాయి కాబట్టే ఆమెపై చర్యలు తీసుకున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. కవిత భుజం మీద తుపాకీ పెట్టి ఎవరో కాలుస్తున్నారని, కాలగమనంలో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు.

సత్యవతి రాథోడ్ ఘాటు రియాక్షన్…
పార్టీలో ఉన్నంత కాలం కేసీఆర్ కుమార్తెగా ఆమెకు ఎక్కడలేని గౌరవం ఇచ్చిన నేతలు కూడా ఇప్పుడు తమ లోపల ఉన్న అసలు నిజాన్ని బయటపెడుతున్నారు. కవిత పార్టీలో ఉంటే ఎంత పోతే ఎంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. పార్టీపై కవిత తప్పుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పార్టీ తరపున వెంట వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ నోట్లు విడుదల చేసి హడావిడి చేస్తున్నారు. మొత్తమ్మీద కవిత ఎగ్జిట్ పై బీఆర్ఎస్ కొంతకాలం సైలెంట్ గా ఉంటుందనే అంచనాలు నిజం కాలేదు. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన వెంటనే అందరూ విమర్శలు మొదలు పెట్టారు. ఇప్పటి వరకూ ఉన్న సైలెన్స్ ని బ్రేక్ చేశారు.

కేటీఆర్, హరీష్ స్పందన ఏంటి..?
కవిత సస్పెన్షన్ పై కేటీఆర్ సైలెంట్ గా ఉన్నారంటే ఓ అర్థం ఉంది, కవితనుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హరీష్ రావు కూడా సైలెంట్ గా ఉండటం ఇక్కడ విశేషం. హరీష్ రావు అంత తేలిగ్గా బయటపడే వ్యక్తి కాదని, అందుకే సైలెంట్ గా ఆయన చేయాల్సింది చేస్తుంటారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హరీష్ టీమ్ కవితపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక కవిత తన సస్పెన్షన్ పై రేపు స్పందించే అవకాశం ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి మరింత ఘాటు రియాక్షన్లు వస్తాయని అంటున్నారు.

Related News

BIG TV Free Medical Camp: ప్రజా సేవే లక్ష్యంగా.. బిగ్ టీవీ ఫ్రీ మెడికల్ క్యాంపు

Worms In Mysore Bonda: షాకైన కస్టమర్.. మైసూర్ బోండాలో పురుగులు..

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ ప్లాన్ బి.. మరో నామినేషన్ వేయించిన గులాబీ పార్టీ

Kavitha: భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాగృతి అధ్యక్షురాలు కవిత

Hyderabad: ఇదెక్కడి వింత రా బాబు.. చిల్లర కోసం బస్సు ముందు ధర్నా..

Bank Holidays: వరుస సెలవులు.. పండుగ వేళ ఐదు రోజులు బ్యాంకులు బంద్!

CM Progress Report: అందరూ మెచ్చేలా.. పిల్లలకు నచ్చేలా.. విద్య శాఖపై సీఎం రేవంత్ ఫోకస్

Hyderabad News: చిట్టీల పేరుతో ఆర్ఎంపీ డాక్టర్ కోట్ల రూపాయల మోసం.. హైదరాబాద్‌లో ఘటన

Big Stories

×