OTT Movie : ‘డేటింగ్ యాప్’ ఈ పేరు వింటే కుర్రకారుకి గిలిగింతలు వస్తాయి. ఎక్కడలేని ఉత్సాహంతో కొండ మీద కోతిని కూడా తెచ్చేస్తాం అనే ఫీలింగ్ లో ఉంటారు. దీని వెనుక జరిగే దారుణాలు తెలిస్తే దాని జోలికి కూడా వెళ్ళరు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఫ్రెండ్ షిప్ పేరుతో ఈ డేటింగ్ యాప్ లు గలీజ్ పనులకు అడ్డాగా మారాయి. దీని వల్లమోసపోయిన వాళ్ళ గురించి ఒక డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సిరీస్ లో బాధితులు డేటింగ్ యాప్ తో ఎలా మోసపోతున్నారో ఒక లేడీ డిటెక్టివ్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ కి రాబోతోంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
నెట్‌ఫ్లిక్స్‌లో
‘లవ్ కాన్ రివెంజ్’ (Love Con Revenge) 2025లో విడుదలైన డాక్యుమెంటరీ సిరీస్. ఇది రియాలిటీ థ్రిల్లర్ శైలిలో రూపొందింది. ఇది జేమ్స్ ఓ’రైలీ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో సిసిలీ ఫ్జెల్‌హోయ్ (ది టిండర్ స్విండ్లర్ డేటింగ్ యాప్ బాధితురాలు) ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ బ్రియాన్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. 2025 సెప్టెంబర్ 5 నెట్‌ఫ్లిక్స్‌లో ఆరు ఎపిసోడ్‌లతో విడుదలైన ఈ డాక్యుమెంటరీ IMDbలో 6.3/10 రేటింగ్ పొందింది.
స్టోరీలోకి వెళ్తే
సెసిలీ ఒక డేటింగ్ యాప్ లో సైమన్ అనే మోసగాడి చేతిలో దారుణంగా మోసపోతుంది. ఆమె ఈ సిరీస్‌లో రొమాన్స్ స్కామ్‌లను బయటపెట్టే లక్ష్యంతో బ్రియాన్ జోసెఫ్‌తో కలిసి పనిచేస్తుంది. ఈ సిరీస్ డేటింగ్ యాప్‌ల ద్వారా ప్రేమ పేరుతో వంచించి బాధితుల నుండి డబ్బు దొంగిలించే మోసగాళ్లను లక్ష్యంగా చేసుకుంటుంది. సెసిలీ తన సొంత అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలతో, ప్రపంచవ్యాప్తంగా రొమాన్స్ స్కామ్‌లకు గురైన వ్యక్తులను కలుస్తుంది. ఈ సిరీస్ మోసపోయిన వాళ్ళ కథలను చూపిస్తూ, వాళ్ళ ఆర్థిక భావోద్వేగ నష్టాలను హైలైట్ చేస్తుంది. అలాగే సెసిలీ బ్రియాన్ ఈ మోసాల వెనుక ఉన్న నేరస్థులను ఎలా ట్రాక్ చేస్తారో చూపిస్తుంది.
ఈ డాక్యుమెంటరీ సిరీస్ రొమాన్స్ స్కామ్‌ల మోసాలను, ముఖ్యంగా డేటింగ్ యాప్‌ల వాడకం పెరిగిన నేపథ్యంలో, వాటి భయంకరమైన పరిణామాలను బయటపెట్టడానికి ప్రయత్నిస్తుంది. సెసిలీ, బ్రియాన్ మోసగాళ్ల నుంచి బాధితుల కోసం పోరాడుతూ వారికి సహాయపడతారు. ఈ క్రమంలో వీళ్ళు చాలా మంది నేరస్థులను ఎదుర్కొంటారు. ఇది ఒక ఉత్కంఠభరితమైన ప్రయాణంగా మారుతుంది. మరి ఈ మోసాలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటే, ఈ డాక్యుమెంటరీ సిరీస్ ని తప్పకుండా చూడండి.