E-Paper
Advertisement

Mahesh Kumar Goud: బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి.. ఫోన్ ట్యాపింగ్ ఘోరమైన నేరం.. పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ !

Mahesh Kumar Goud: బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి.. ఫోన్ ట్యాపింగ్ ఘోరమైన నేరం.. పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ !
Advertisement

Mahesh Kumar Goud:  బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్​ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు.  ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ…గత బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అరాచక పాలనపై విచారణలు జరుగుతున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఘోరమైన నేరం అన్నారు.కేటీఆర్ ,హరీష్ ,సంతోష్ మాదిరి కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇచ్చి విచారిస్తుందన్నారు. కేసీఆర్ విచారణను భూతద్దంలో చూడటం హాస్యాస్పదం అన్నారు. కేసీఆర్ నీతిమంతుడనీ , అన్యాయమని అనడం గగ్గోలు పెట్టడం సరికాదన్నారు. కేసీఆర్ రాజరిక పాలనలో ఉన్నామనే భ్రమలో ఇంకా బీఆర్ ఎస్ నేతలు ఉన్నారన్నారు.

కేసీఆర్ ఆజ్ఞ లేనిదే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు 

Advertisement

చట్టం తన పని తాను చేస్తుంటే నిందలు వేయడం విచారకరమన్నారు. గతంలో శిబూ సోరెన్, మాయావతి, జయలలయిత, లాలు ప్రసాద్ యాదవ్, యడ్డీరప్ప లాంటి ముఖ్యమంత్రులు విచారణలు ఎదుర్కొన్నారన్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం విపత్కర పరిస్థితుల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. కేసీఆర్ ఆజ్ఞ లేనిదే ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు. పారిశ్రామిక వేత్తలు, సినీతారల ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాప్ తో భార్య భర్తల సంసారాల్లో తొంగి చూశారన్నారు. ఇప్పుడు వయస్సు కోసం కేసీఆర్ మాట్లాడటం ఆశ్చర్యకరమన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ ను 70 ఏళ్ల వయసులో ప్రగతి భవన్ ముందు 7 గంటకు వెయిట్ చేయించిన విషయం మరిచిపోయావా? తలుపులు బద్దలు కొట్టి కోదండ రామ్ ను తీసుకెళ్లినవుడూ వయసు గుర్తుకు రాలేదా? అంటూ టీపీసీసీ చీఫ్​ మండిపడ్డారు.

Also ReadMahesh Kumar Goud: బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విచారణ జరగాలి.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్!

Advertisement

కేసీఆర్ సిట్ విచారణపై ప్రజలకు నిజాలు

నోటీసులు ఎవరికైనా పర్మనెంట్ అడ్రస్ కి ఇస్తారన్నారు. కేసీఆర్ సిట్ విచారణపై ప్రజలకు నిజాలు వివరించేందుకు డీసీసీలు చొరవ తీసుకొని స్పందించాలన్నారు. కేసిఆర్ పాలనలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, ప్రజాధన దుర్వినియోగంపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా అక్రమ గంజాయి రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన సౌమ్య సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇలాంటి దారుణ ఘటనలు ప్రజాస్వామ్య సమాజానికి మచ్చగా మిగులుతాయని అన్నారు. మృతిచెందిన సౌమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో వారికి ధైర్యం చేకూరాలని ప్రార్థించారు. సౌమ్య గారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Also Read: Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు.. భద్రతా ప్రమాణాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి!

Related News

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

బహదూర్‌గూడలో హైటెన్షన్.. పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరేసిన రైతులు.. ఎందుకంటే?

Food Adulteration Law: ఆహార కల్తీ దందాకు ఇక చెక్.. తెలంగాణలో రాబోతున్న కొత్త చట్టం ఇదే!

Big Stories

Advertisement
×