E-Paper
Advertisement

Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు.. భద్రతా ప్రమాణాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి!

Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు..  భద్రతా ప్రమాణాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి!
Advertisement

Uttam Kumar Reddy: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్.ఎల్.బి.సి నిర్మాణంపనులలో జాప్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు.సొరంగం మార్గం పనులను నిరంతరం కొనసాగించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.సొరంగ నిర్మాణ పనులలో ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన వివరించారు. అర్దాంతరంగా నిలిచి పోయిన ఎస్ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణ కై చేపట్టిన హెలి-బోర్న్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని ఆయన చెప్పారు.శ్రీశైలం ఎడమగట్టు కాలువతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పధకంలో అంతర్భాగమైన మెడిగడ్డ, సుందిళ్ళ,అన్నారం బ్యారేజ్ ల పునరుద్ధరణ పనులపై ఆయన ఆదివారం సాయంత్రం నీటిపారుదల శాఖాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గం మిగిలిన భాగం పూర్తి చేయడానికి అవసరమైన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన ఏరియల్ ఎలాక్ట్రో మాగ్నెటిక్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని ఆయన తెలిపారు. సొరంగమార్గం పూర్తికి సర్వే ఆధారంగా రూపొందించిన నివేదిక దోహద పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.భౌగోళికంగా ప్రతికూల పరిస్థితిలు ఏర్పడితే ముందస్తుగా బందోబస్తు చర్యలు చేపట్టదానికి ఈ సర్వే ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.సొరంగమార్గం పూర్తి చేయడానికి గాను ఆధునిక పరిజ్ఞానం వినియోగించడంతో పాటు శాస్త్రీయ పద్దతిలో నిరంతరం అధికారుల పర్యవేక్షణలో పనులు కొనసాగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Advertisement

Also Read: Phone Tapping Case: కేసీఆర్ విచారణలో పార్ట్-1 కంప్లీట్.. మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా?

పర్యవేక్షణ కన్సల్టెంట్ ను నియమించాలి

ప్రాజెక్టు నిర్వహణకై ప్రత్యేకంగా డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆపరేషన్ బృందానికి ప్రత్యేక చీఫ్ ఇంజనీర్ ను నియమించాలని ఆయన అధికారులను ఆదేశించారు.నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎప్పటికప్పుడు భద్రతా,నాణ్యత ప్రమాణాలను పాటించేలా చూడడంతో పాటు అధికారులు రూపొందించిన డిజైన్ ప్రకారం నిర్మాణం కొనసాగేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన చీఫ్ ఇంజినీర్ కు సహకరించేలా ఉండేందుకు స్వతంత్ర పర్యవేక్షణ కన్సల్టెంట్ ను నియమించాలని ఆయన సూచించారు. నిరంతరం పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు గాను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ క్షేత్ర స్థాయిలో భాగస్వామ్యులు అవుతారని ఆయన చెప్పారు.

జియాలజికల్ బృందాలను ఏర్పాటు

Advertisement

అదే సమయంలో సొరంగ మార్గంలో ఏర్పదుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు గాను ప్రత్యేక జియో టెక్నీకల్,జియాలజికల్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. దీనితో పాటు కాళేశ్వరం బ్యారేజ్ ల పనుల పునరుద్ధరణ పనులు వేగవంతంచేయడానికి అవసరమైన సాంకేతిక సంస్థలను,డిజైన్ కన్సల్టెంట్స్ సమన్వ్యయం ఆవశ్యకత గురుంచి ఆయన వివరించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించే పరీక్షల షెడ్యూల్ ,ప్రాజెక్ట డిజైనర్ల పనితో సమన్వయం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.పరస్పరం సమన్వయం చేసుకుంటూ పోతే కేంద్ర జల వనరుల సంఘం పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుండి డిజైన్ లకు దశలవారిగా అనుమతులు పొందడం సులభతరమౌతుందని ఆయన చెప్పారు .ఈ నెల 16 తరువాత ఎన్.డి.ఎస్.ఏ నిపుణుల కమిటీ తో సమావేశం నిర్వహించాలని అధికారులకు సూచించారు. పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన అనుమతులు పొంది పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

Also Read: Palla Rajeshwar Reddy: కేసీఆర్ ను వేధించ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మా? ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×