Patnam Narender Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కలెక్టర్ పై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నేతలే స్థానికులను రెచ్చగొట్టి కలెక్టర్ పై దాడి చేయించారని వార్తలు వస్తున్నాయి.
Also read: డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు, కాసేపట్లో నోటిఫికేషన్
ఈ క్రమంలో దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు నరేందర్ రెడ్డితో ఎక్కువసార్లు ఫోన్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయనను విచారించేందుకు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు నిందితులను విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు. అధికారులపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడి గురించి ముందే చర్చలు జరిపినా ఆపడంలో ఇంటిలెజెన్స్ విఫలమైందని మండిపడ్డారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఘటనను తీవ్రంగా ఖండించారు. దాడి వెనక ఎంతటి వారు ఉన్నా ఊసలు లెక్క పెట్టాల్సిందేనని హెచ్చరించారు. ఈ క్రమంలో పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం కావాలనే కాంగ్రెస్ తమపై కుట్ర చేస్తోందని మండిపడుతున్నారు.
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు #PatnamNarendarReddy #LagacharlaIncident #Bigtv https://t.co/UobFBJb9vn pic.twitter.com/6OCTaFjpQk
— BIG TV Breaking News (@bigtvtelugu) November 13, 2024