SSMB29 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో ఇప్పుడు చేయబోయే సినిమా కోసం జాగ్రత్తలు తీసుకున్నాడని తెలుస్తుంది. ఈసారి పాన్ ఇండియా హిట్ ను కొట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు మహేష్.. గత రెండేళ్ల నుంచి మహేష్ బాబు, రాజమౌళి సినిమా రాబోతుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అదిగో, ఇదిగో అని జక్కన్న సినిమాను ఇంకా ముందుకు తీసుకెళ్లలేదు. అయితే ఈ మూవీ గురించి రోజుకో వార్త చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ సినిమా లొకేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.
రాజమౌళి, మహేష్ బాబు సినిమాకు సంబందించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ కథ వారణాసి నేపథ్యంలో మొదలవుతుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆ తరవాత కథ సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుందట. వారణాసి షెడ్యూల్ మొత్తం ఓ సెట్ లో పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. అందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ తీర్చిదిద్దుతున్నారు. తొలుత ఇక్కడ షూటింగ్ ప్రారంభించి, అక్కడ కొన్ని సీన్లు చేసి ఆ తర్వాత ఆఫ్రికాకు వెళ్లి షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. అక్కడ అడవిలో కొన్ని సన్నివేశాలను తెరకేక్కించునున్నారు.
ఇక ఈ సినిమా మొత్తం అటవీ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అందుకే దట్టమైన అటవీ ప్రాంతాలున్న ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించారు. గతంలో రాజమౌళి అడవుల కోసం వెళ్లిన కొన్ని ఫోటోలు కూడా అప్పటిలో బాగా వైరల్ అయ్యాయి. ఏయే సన్నివేశాలు ఎక్కడెక్కడ షూట్ చేయాలి అనే విషయంపై ఓ అంచనాకు అప్పుడే వచ్చారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇండోనేషియా కు చెందిన ఓ హీరోయిన్ ను ఈ సినిమా కోసం ఎంచుకొందామనుకొన్నారు. ఆమెపై ఫొటో షూట్ కూడా నిర్వహించారు. అయితే ఆమెనే తీసుకుంటారా లేదా వేరేవారినా అనే దానిపై ఇంకా క్లారీటి రాలేదు.. ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాకు నెక్ట్స్ లెవల్ లో ఉండబోతోంది.
ఈ చిత్రం షూటింగ్ జనవరి 2025లో ప్రారంభం కానుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్ల పైగానే ఉంటుందని చెప్పుకుంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా కోసం లుక్ పూర్తిగా మారిపోయింది. గుబురు గడ్డం, పొడవు జుట్టుతో కనిపించునున్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు లుక్ మాత్రమే వైరల్ అయ్యింది. కానీ ఇప్పుడు లొకేషన్ కూడా వైరల్ అవ్వడంతో కల్కి లొకేషన్ ను ఫిక్స్ చేశారు. రాజమౌళి సినిమా కాబట్టి కల్కి రికార్డ్ లను బ్రేక్ చేస్తుందా అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..