BigTV English

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

Telangana Assembly live updates(TS today news): తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సబితకు క్షమాపణలు చెప్పాలని సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన చేశారు. సీఎం క్షమాపణ చెప్పే వరకూ అక్కడి నుంచి కదిలేది లేదంటూ.. నినాదాలు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ తో బయటికి పంపించేశారు. వారందరినీ తెలంగాణ భవన్ కు తరలించారు.


అంతకుముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా మర్యాదలు పాటించాలని సూచించారు. కూర్చోకపోతే ఎవరికీ మైక్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. స్పీకర్ ను ఎన్నిసార్లు మైక్ ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని వాపోయారు ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవన్నారు.

 

Related News

Hyderabad rains update: హైదరాబాద్ వర్షాల అలర్ట్.. మరికొద్ది గంటల్లో దంచుడే.. బయటికి వెళ్లొద్దు!

Telangana floods: 48 గంటల్లో 1,646 ప్రాణాలు సేఫ్.. ఈ అధికారులకు సెల్యూట్ కొట్టాల్సిందే!

Telangana floods: మీ రహదారులకు గండి పడిందా? రోడ్లు దెబ్బతిన్నాయా? వెంటనే ఇలా చేయండి!

Telangana Police: కుళ్లిన శవాన్ని మోసిన పోలీస్ అధికారి.. తెలంగాణలో హృదయాన్ని తాకిన ఘటన!

Telangana rains: భారీ వర్షాల దెబ్బ.. తెలంగాణలో భారీగా అంగన్వాడీ భవనాలకు నష్టం!

Vinayaka Chavithi: వినాయకుని పూజ కోసం రచ్చ.. ఏకంగా పూజారినే ఎత్తుకెళ్లారు!

Big Stories

×