BigTV English

Happy Birthday Director Bobby: డైరెక్టర్ బాబీ బర్త్ డే.. బాలయ్య బాబు ‘NBK 109’ నుంచి మాస్ వీడియో అదిరిపోయింది

Happy Birthday Director Bobby: డైరెక్టర్ బాబీ బర్త్ డే.. బాలయ్య బాబు ‘NBK 109’ నుంచి మాస్ వీడియో అదిరిపోయింది

Director Bobby – NBK 109: నందమూరి బాలయ్యబాబు సినిమాలపై తెలుగు సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే థియేటర్ల వద్ద హంగామా చేస్తుంటారు. ముఖ్యంగా బాలయ్య బాబు సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చూసేందుకు థియేటర్లకు పరుగులు పెడుతుంటారు. అందువల్లనే దర్శకులు సైతం ఆయన సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్, పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలను ఎక్కువగా పెడుతుంటారు.


ఇక బాలయ్య బాబు నటించిన చివరి చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో బాలకృష్ణ మాస్ యాక్షన్ సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల నటించారు. అదే జోష్‌లో బాలయ్య బాబు మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సారి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు దర్శకుడు బాబీ కొల్లితో జతకట్టాడు.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు బాబి.. ఇప్పుడు బాలయ్య బాబుతో ‘NBK 109’ మూవీ చేస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలయ్యను మోస్ట్ పవర్‌ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడు దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ నాగవంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.


Also Read: ‘ఎన్‌బీకే 109’ అప్డేట్.. బాయ్యలను ఢీ కొట్టే పాత్రలో కన్నడ స్టార్ హీరో

కాగా ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన బాలయ్య బాబు మాస్ యాక్షన్ గ్లింప్స్ ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి. కత్తులతో వేటాడే సన్నివేశాలు అభిమానుల్ని, సినీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇవాళ దర్శకుడు బాబీ బర్త్ డే కావడంతో సినిమా నుంచి మేకర్స్ మరో అప్డేట్ అందించారు. ఇందులో భాగంగానే ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో దర్శకుడు బాబీ షూటింగ్ విధానాన్ని చూపించారు. అందులో అతడు బాలయ్యపై చిత్రీకరించే సన్నివేశాలను చూపించారు. ఈ వీడియోతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్‌లు త్వరలో వెల్లడించనున్నారు.

ఇకపోతే ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అలాగే చాందిని చౌదరి కూడా ఈ మూవీలో నటిస్తున్నట్లు సమాచారం. దీంతో మంచి పాపులర్ ఉన్న నటీ నటులు బాలయ్య మూవీలో నటిస్తుండటంతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. అలాగే ఇందులో బాలయ్యకు విలన్ పాత్రలో కన్నడ హీరో రిషి నటిస్తున్నట్లు మేకర్స్ ఇటీవల తెలిపారు. చూడాలి మరి సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో.

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×