BigTV English

PAC Meeting: పీఏసీ మీటింగ్, బీఆర్ఎస్ వాకౌట్.. ఆ సంగతేంటి?

PAC Meeting: పీఏసీ మీటింగ్, బీఆర్ఎస్ వాకౌట్.. ఆ సంగతేంటి?

PAC Meeting: తెలంగాణలో రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. శనివారం అసెంబ్లీ హాలులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దీన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసలు ఛైర్మన్ ఎన్నికే చెల్లదన్నది వారి వాదన.


తెలంగాణ అసెంబ్లీ హాలులో శనివారం పీఏసీ కమిటీ సమావేశం జరిగింది. ఛైర్మన్ అరికపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభ్యులు మిగతా పార్టీల సభ్యులు వివిధ అంశాలపై చర్చించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. పీఏసీ ఛైర్మన్ ఎన్నికల చెల్లదన్నది వారి డిమాండ్. పద్దతి ప్రకారం జరగలేదని అంటోంది. అందుకే వాకౌట్ చేసినట్టు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, రమణ చెప్పుకొచ్చారు.


నార్మల్‌గా అయితే పద్దతి ప్రకారం పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఆనవాయితీ. కాకపోతే గడిచిన పదేళ్లుగా ఈ పద్దతిని అప్పటి బీఆర్ఎస్ పార్టీ తుంగలో తొక్కింది. 2018లో టీడీపీ, కాంగ్రెస్ సభ్యులను పార్టీలో చేర్చుకున్న బీఆర్ఎస్, ఎంఐఎంకు ఆ పదవి అప్పగించింది.

ALSO READ: ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన వ్యక్తి ఏచూరి: సీఎం రేవంత్

అప్పుడు సంప్రదాయాలను పక్కన పెట్టేసి విషయం గుర్తుకు రాలేదా అన్నది కాంగ్రెస్ నేతల మాట. ఇప్పుడే గుర్తు వచ్చిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. పద్దతి ప్రకారం ఐదు పేర్లు ఇచ్చామని, ఆ జాబితాలో హరీష్‌రావు పేరు లేదన్నారు. ఆయన ప్లేస్‌లో గాంధీ పేరు చేర్చారని చెబుతున్నారు కారు పార్టీ ఎమ్మెల్యేలు. దీనిపై పీఏసీలో అడిగినా సరైన సమాధానం రాలేదని, అందుకే వాకౌట్ చేశామన్నది వాళ్ల వెర్షన్. దానికి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం ఇచ్చారు.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×