BigTV English

Fake Pandas in Zoo: జూపార్క్ లో పాండాలను చూడడానికి ఎగబడిన జనం.. నకిలీ పాండాలని తెలియడంతో హంగామా!

Fake Pandas in Zoo: జూపార్క్ లో పాండాలను చూడడానికి ఎగబడిన జనం.. నకిలీ పాండాలని తెలియడంతో హంగామా!

Fake Pandas in Zoo| ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడానికి అతితెలివి గలవారు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. రోజూ టీవీల్లో మనం యాడ్స్ చూస్తూ ఉంటాం. మా ప్రాడక్ట్ లో అది ఉంది. ఇది తీసుకుంటే మీ సమస్యలు తీరిపోతాయి అన్ని పెద్ద ప్రగల్భాలు ఈ యాడ్స్ లో ఉంటాయి. కానీ టీవీలో చూపించే వాటిలో చాలా తక్కువ శాతం వాస్తవాలుంటాయి. ఇలాంటి జిమ్మిక్క ఒకటి జంతువుల జూ పార్క్ లో జరిగింది. అరుదైన పాండాలు అని చెప్పి వేరే జంతువులకు పెయింట్ కొట్టారు. జూ పార్క్ నిర్వహకులు. ఈ ఘటన చైనాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. చైనాలోని గువాంగ్‌డాంగ్ రాష్ట్రంలోని షన్ వేయి జూలో పర్యటకులను ఆకర్షించేందుకు అరుదైన జాతి పాండాలు ఉన్నాయని జూ పార్క్ నిర్వహకులు ప్రకటించారు. పాండా చైనా జాతీయ జంతువు కావడంతో వాటిని చూసేందకు జనం ఎగబడి వెళ్లారు. కానీ ఆ పాండాలను చూసిన జనం తాము మోసపోయామని కాసేపట్లోనే గ్రహించారు.

Also Read: కొత్త కోడలు చేసిన వంట తిని తీవ్రంగా నష్టపోయిన కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు! ..


ఆ పాండాలను ఒక పర్యటకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోకు 1.4 మిలియన్ వ్యూస్, భారీ సంఖ్యలో షేర్లు వస్తున్నాయి. వీడియోలో ఆ పాండా కాస్త కుక్క పోలీకలతో కనిపిస్తోంది. పర్యటకులు ఆ పాండాని తినుబాండారాల ఆశ చూపించగా అది దెగ్గరకు వచ్చి.. అనుకోకుండా దాని అసలు రూపం చూపించేసింది. ‘భౌ భౌ’.. అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దీంతో పర్యటకులంతా షాక్ కు గురయ్యారు. ‘ఇదీ కుక్క పాండా కాదు’ అని పర్యటకులు మాట్లాడుతున్నట్లు స్పష్టంగా వినిపిస్తోంది.

వెంటనే జూ పార్క్ నిర్వహకులతో గొడవపడ్డారు. కుక్కలను చూపించి పాండా అని చెబుతారా?.. అని గట్టిగా నిలదీశారు. దీంతో జూ పార్క్ నిర్వహకులు భయపడిపోయారు. అయినా అవి పాండా కుక్కలని.. పాండా జాతితో వాటికి జన్యు సంబంధం ఉందని నమ్మించడానికి ప్రయత్నించారు. కానీ పర్యటకులలో జంతు ప్రేమికులు.. ఆ కుక్కల జాతిని సైతం బయట పెట్టేశారు.

Also Read: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

ఆ కుక్కలు ‘చౌ చౌ’ జాతికి చెందినవని. చౌ చౌ కుక్కలు చైనాలో చాలా ఫేమస్. వాటిని శరీరం నిండా దట్టమైన వెంట్రుకలుంటాయి. కాస్త పెద్ద ఆకారంలో లావుగా కనిపిస్తాయి. దీంతో ఆ జూ నిర్వహకులు చౌ చౌ కుక్కలకు బ్లాంక్ అండ్ వైట్ పెయింట్ వేసి అరుదైన పాండాలని పర్యటకుల నుంచి డబ్బులు వసూలు చేశారు. పర్యటకులు గొడవ చేయడంతో జూ పార్క్ నిర్వహకులు నిజం అంగీకరించాల్సి వచ్చింది. అవి చౌ చౌ కుక్కలేనని వారు అంగీకరించారు.

ఇలా 2016లో గువాంగ్‌డాంగ్ రాష్ట్రంలోనే ఒక పెట్ షాపులో కుక్కలకు చిరుతపులి లాగా పెయింట్ వేసి అరుదైన చిరుతపులి.. ఇంట్లో పెంచుకోవచ్చు అనే విక్రయాలు చేయగా.. ఆ తరువాత వారిని పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి

Related News

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Big Stories

×