
Rythu Runamafi: ఎన్నికల కమిషన్‌నుంచి అనుమతి రాగానే వారంలోపే రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఒకవేళ అనుమతి రాకుంటే డిసెంబర్ 3 తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క రుపాయి కూడా పెండింగ్ లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే సరిగ్గా ఎన్నికల పోలింగ్ ముందు హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం.. కచ్చితంగా రాజకీయ ఎత్తుగడే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో తెలంగాణలో సంక్షేమ పథకాలను నిలిపివేయాలని కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. రైతులకు ప్రభుత్వ సాయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరు.. కేసీఆర్‌కు పేరు వస్తుందని అన్ని ఆపేయమని చెప్తున్నట్టుగా ఉందని అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి పథకాలను ఈసీ ఆపేయడం మామూలే. కానీ దీనిని కూడా ఎన్నికల స్టంట్‌గా వాడుకుని.. తమపై ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
అంతేకాదు ఎన్నికలకు ముందు ఈసీ నుంచి అనుమతులు పొంది.. ఆ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉండి.. సరిగ్గా పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు వ్యూహాత్మకంగా హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.